Ads
పిల్లల పెంపకం అనేది తల్లిదండ్రులకు అతి ముఖ్యమైన బాధ్యత. వారు పెరిగే విధానం బట్టే వారి భవిష్యత్ ఆధారపడి ఉంటుంది. ఇంకా చెప్పాలి అంటే తల్లిదండ్రులే పిల్లలకు ఆదర్శంగా ఉండాలి. ఎందుకంటే తల్లిదండ్రులే పిల్లలకు మొదటి గురువులు.
Video Advertisement
తల్లిదండ్రుల నడవడికను పిల్లలు అనుసరిస్తుంటారు. ఒకసారి తల్లిదండ్రులు తెలుసో తెలియకో పిల్లల ముందు కొన్ని మాటలు కోపంతో అనేస్తుంటారు. కానీ పిల్లలు మనం చేసే ప్రతి పనిని గమనిస్తుంటారు. పిల్లల పెంపకంలో మనం ఎంతో జాగ్రత్త వహించాలి.
ఇప్పుడు మనం పిల్లల ముందు చెయ్యకూడని ఆ అయిదు పనులు ఏంటో తెలుసుకుందాం..
#1. అబద్దాలు చెప్పడం :
కొన్ని విషయాలలో తల్లిదండ్రులు అసలు విషయం గురించి చెప్పకుండా అబద్ధాలు చెబుతుంటారు. అదేవిధంగా ఒక్కొక్కసారి పిల్లల్ని కూడా అబద్దం చెప్పమని అడుగుతారు. ఈ విధంగా చేయడం వల్ల పిల్లలకు అది అలవాటుగా మారుతుంది.
చివరకు తల్లిదండ్రులు నేర్పించిన ఈ అబద్దం అనే మాటనే వాళ్ళు ఆసరాగా తీసుకొని ప్రతి విషయంలో తల్లిదండ్రులకు అబద్ధం చెప్పే విధంగా తయారవుతారు. దీనివలన భవిష్యత్తులో తల్లిదండ్రులు పిల్లలతో అనేక సమస్యలు ఎదుర్కొంటారు.
#2. బాడీ షేమింగ్ :
తల్లిదండ్రులు ఎప్పుడూ తమ పిల్లలను రూపురేఖల గురించి గాని, మాట తీరు గురించి గాని ఎప్పుడూ వంకలు పెట్టకూడదు. నువ్వు ఎక్కువగా తింటున్నావ్ నువ్వు చూడటానికి లావుగా ఉన్నావు అని తల్లిదండ్రులు అనడం వల్ల పిల్లలు మానసికంగా ఒత్తిడికి లోనవుతారు. వారు చేసే ప్రతి పనిలోను ఇబ్బంది పడుతుంటారు.
తనకు ఏదైనా సమస్య వచ్చినప్పుడు తల్లిదండ్రులు ముందు చెప్పడానికి వెనకాడతారు. ఇలా తల్లిదండ్రులు చేయడం అనేది చాలా పెద్ద తప్పు. బాహ్య సౌందర్యం కంటే ఆత్మసౌందర్యం మిన్న అనే విషయాన్ని పిల్లలకు అర్థమయ్యే విధంగా తల్లిదండ్రులు నేర్పించాలి.
#3. ఇతరులతో పోల్చడం :
మీ పిల్లలను ఎప్పుడూ ఇతరులతో పోల్చకూడదు. ఎప్పుడైతే తల్లిదండ్రులు పిల్లలను ఇతరులతో పోల్చుతారో, వారిలోని సొంతంగా అభివృద్ధి చెందే ఆత్మన్యూనతభావాన్ని చంపేసినవారు అవుతారు. దీనివల్ల పిల్లలకు అసూయ, ఈర్ష్య అనే భావనలు పెరుగుతాయి. ఈ విధంగా పిల్లలను ఇతరులతో పోల్చడం అనేది మనదేశంలో తల్లిదండ్రులు ఎక్కువగానే చేస్తుంటారు.
#4. క్రమశిక్షణ లేకపోవడం :
తల్లిదండ్రులే పిల్లలకు మొదటి గురువు. తల్లిదండ్రులు చేసే ప్రతి పనిని పిల్లలు గమనిస్తుంటారు. పిల్లల ముందు తల్లిదండ్రులు కొన్ని కొన్ని పనులు చేయకుండా దూరంగా ఉండడమే మంచిది. పిల్లలు కూడా తల్లిదండ్రులు చేసే పనిని అనుసరించి దారి తప్పే ప్రమాదం ఉంటుంది.
#5. అసహ్యకరమైన ప్రవర్తన :
ఒకసారి తల్లిదండ్రులు కోపంతో పిల్లల ముందు అసహ్యంగా మాట్లాడుకుంటూ గొడవ పడుతుంటారు. ఇలా చేయడం వలన పిల్లలు మానసికంగా ఎంతో ఇబ్బంది పడుతుంటారు. సాధ్యమైనంత వరకు తల్లిదండ్రుల మధ్య గొడవలు పిల్లలకు తెలియకపోవడమే మంచిది.
Note: Images used in this article are reference purposes only.
End of Article