Ads
అన్‌స్టాపబుల్ సీజన్ 2లో ఇప్పటివరకు అత్యధిక హైప్ ఉన్న ప్రభాస్ ఎపిసోడ్ మొదటి భాగాన్ని ఆహా స్ట్రీమింగ్ ప్రారంభించింది. అయితే స్ట్రీమింగ్ ప్రారంభమైన కాసేపటికే ఆహా సర్వర్లు క్రాష్ అయ్యాయి. ఎపిసోడ్ చూడాలని ప్రయత్నించిన అభిమానులకు యాప్ ఓపెన్ కాలేదు. ఈ విషయాన్ని ఆహా కూడా ట్విట్టర్ ద్వారా ప్రకటించింది. ప్రభాస్ ఫ్యాన్స్ ప్రేమ కారణంగా ‘ఆహా’ యాప్ ఓవర్‌లోడ్ అయిందని, త్వరలో దాన్ని రీస్టోర్ చేస్తామని ప్రకటించింది. ఈ ఎపిసోడ్ రెండు భాగాలుగా ప్రసారం కానుంది.
Video Advertisement
తొలిసారి ప్రభాస్ ఇలాంటి టాక్ షోకి హాజరవడంతో ఈ ఎపిసోడ్‌పై అంచనాలు పెరిగిపోయాయి. దానికి తోడు ఎపిసోడ్‌కి సంబంధించి ఆహా రిలీజ్ చేసిన ప్రొమోలతో ఆసక్తి రెట్టింపైంది. వాస్తవానికి శుక్రవారం రిలీజ్ చేయాల్సిన ఈ ఎపిసోడ్‌ని ప్రభాస్ అభిమానుల కోరిక మేరకు ఆహా ముందుగా రిలీజ్ చేసింది. అయితే.. పెద్ద సంఖ్యలో అభిమానులు ఒక్కసారిగా ఆహా సైట్‌లోకి ఎంట్రీ ఇవ్వడంతో సైట్ క్రాష్ అయ్యింది.
మొదటి భాగం ఇప్పటికే విడుదల అయింది. రెండో భాగం జనవరి 6వ తేదీ నుంచి స్ట్రీమ్ కానుంది. ప్రభాస్‌తో పాటు తన ప్రాణ స్నేహితుడు గోపిచంద్ కూడా ఈ ఎపిసోడ్‌లో పాల్గొన్నాడు. రామ్‌చరణ్‌కు కూడా ప్రభాస్ కాల్ చేసినట్లు ప్రోమోలో చూడవచ్చు. అయితే ఈ ఎపిసోడ్ ఆహా రికార్డ్స్ ని తిరిగి రాసినట్లు తెలుస్తోంది. అలాగే ఈ ఎపిసోడ్ ప్రోమోల్లో బాలయ్య, ప్రభాస్, గోపీచంద్‌ల సరదా సంభాషణలు, చమత్కారాలను చూపించారు.
మరోవైపు అన్‌స్టాపబుల్ ప్రభాస్ ఎపిసోడ్ వీడియోలు కాపీ చేసి సోషల్ మీడియాలో లీక్స్ చేస్తున్నారు. ఈ అక్రమ కాపీని సీరియస్ గా తీసుకున్న అర్హా మీడియా బ్రాడ్‌కాస్టింగ్ సంస్థ ఢిల్లీ హైకోర్టులో కేసు వేసింది. ఈ సందర్భంగా కోర్టు నేడు ఉత్తర్వులు జారీచేసింది. అన్‌స్టాపబుల్ ని అక్రమంగా కాపీ చేయకుండా.. పలు వెబ్‌సైట్‌లను నిషేధిస్తూ ఢిల్లీ హైకోర్టు ‘జాన్ డో’ సంచలన జడ్జిమెంట్ ఇచ్చింది.
అన్ స్టాపబుల్’ మొదటి సీజన్ ను చట్టవిరుద్ధంగా ప్రసారం చేస్తున్న 265 వెబ్ సైట్ లు .. రెండవ సీజన్ ను స్ట్రీమింగ్ చేస్తున్న 64 వెబ్ సైట్ లపై ఆహా సంస్థ కోర్టుని ఆశ్రయించింది. దీనిపై విచారించిన కోర్టు కాపీరైట్ చట్టాన్ని ఉల్లంఘిస్తే సదరు వెబ్ సైట్లకు తీవ్ర పరిణామాలు తప్పవని.. అవసరమైతే జైలుకి కూడా పంపుతామని కోర్టు హెచ్చరించింది. దీంతో డార్లింగ్ ప్రభాస్ ఫాన్స్ లవ్ ఇలాగే ఉంటుంది అని కామెంట్స్ చేస్తున్నారు. డార్లింగ్ ప్రభాస్ క్రేజ్ రేంజ్ ఇది అంటూ ఫాన్స్ సంబరాలు చేసుకుంటున్నారు.
End of Article