మహేష్ బాబు లాగే “స్మోకింగ్” మానేసిన 6 మంది హీరోలు వీరే…మానేయడానికి కారణాలు ఏంటంటే.?

మహేష్ బాబు లాగే “స్మోకింగ్” మానేసిన 6 మంది హీరోలు వీరే…మానేయడానికి కారణాలు ఏంటంటే.?

by Megha Varna

Ads

ధూమపానం, మద్యపానం ఆరోగ్యానికి హానికరం అని తెలిసినా చాలామంది బానిసలై పోతున్నారు. నిజానికి ఈ అలవాటు ఉండటం వల్ల అనారోగ్య సమస్యలు ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది. అయితే ఒకవేళ కనుక మీకు అలవాటు ఉండి మానలేకపోతుంటే.. ఈ తారల్ని ఆదర్శంగా తీసుకుని మానేయండి.

Video Advertisement

ఈ సినీ తారలకి కూడా స్మోకింగ్ అలవాటు ఉండేదట. కానీ వాళ్ళు మొత్తానికి ఇప్పుడైతే మానేశారు.  స్మోకింగ్ వల్ల ఎన్నో బాధలు పడాలి. అయితే ఒకవేళ మీకు కూడా స్మోకింగ్ అలవాటు ఉండి.. మానలేకపోతుంటే వీళ్ళని ఆదర్శంగా తీసుకోండి.

#1. కమల్ హాసన్:

కమల్ హాసన్ తెలియనివాళ్లు ఉండరు. తెలుగులో కూడా కమల్ హాసన్ ఎన్నో అద్భుతమైన చిత్రాలు చేశారు. కమల్ హాసన్ కి ఒకప్పుడు సిగరెట్ అలవాటు ఉండేది. కానీ తోటి హీరోయిన్స్ కి ఇబ్బంది అవ్వకూడదని అలవాటు మానుకున్నారు కమల్ హాసన్.

#2. రజినీకాంత్:

అప్పటి నుండి ఇప్పటి వరకు కూడా ఎన్నో అద్భుతమైన సినిమాల్లో నటించారు రజనీ కాంత్. ఈయనకి కూడా ఒకప్పుడు స్మోకింగ్ అలవాటు ఉండేది. కానీ ఆయన మనవడి కారణంగా స్మోకింగ్ మానేశారు.

#3. మహేష్ బాబు:

సూపర్ స్టార్ మహేష్ బాబు ఎంత పాపులర్ ఓ ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. మహేష్ బాబు కూడా ఒకప్పుడు ధూమపానం చేసేవారు. అయితే ఒకనాడు తన స్నేహితుడు ఇచ్చిన ఒక పుస్తకం చదివాక ఆ అలవాటు మానుకోవాలని నిర్ణయించుకున్నారు.

#4. విజయ్ దేవరకొండ:

ఆరోగ్యపరంగా ఇబ్బందులు ఎదుర్కోవాలని విజయ్ దేవరకొండ సిగరెట్ మానేశారు.

#5. రానా:

రానా కూడా ఒకప్పుడు స్మోకింగ్ చేసేవారు. అయితే డబ్బింగ్ చెప్పేటప్పుడు చాలా ఇబ్బంది పడ్డారట. అందుకనే స్మోకింగ్ కి దూరంగా ఉండాలని ఈ నిర్ణయం తీసుకున్నారు.

#6. పవన్ కళ్యాణ్:

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి కూడా ఒకప్పుడు స్మోకింగ్ అలవాటు ఉండేది. కానీ ఆరోగ్యం పాడవుతుంది అని ఈ అలవాటుకి గుడ్ బై చెప్పేసారు పవన్ కళ్యాణ్.


End of Article

You may also like