“శ్రీదేవి” నుండి “పాయల్ రాజ్ పుత్” వరకు దివ్యాంగుల పాత్రల్లో నటించి మెప్పించిన 8 హీరోయిన్లు.!

“శ్రీదేవి” నుండి “పాయల్ రాజ్ పుత్” వరకు దివ్యాంగుల పాత్రల్లో నటించి మెప్పించిన 8 హీరోయిన్లు.!

by Megha Varna

Ads

సినీ ఇండస్ట్రీలో మంచి పేరు పొందాలన్నా.. ఎక్కువకాలం నిలబడాలన్న అంత సులభం కాదు. అద్భుతమైన పాత్రలు చేస్తే కానీ ప్రేక్షకులకు దగ్గర అవ్వలేరు. మామూలుగా ఎవరైనా నటిస్తారు కానీ ఫిజికల్లీ చాలెంజింగ్ పాత్రలు చేసి కూడా నటించి మెప్పించిన హీరోయిన్లు కొందరు ఉన్నారు.

Video Advertisement

మూగ, గుడ్డి మొదలైన పాత్రలు చేసి చక్కటి పేరును తెచ్చుకున్నారు. అలా దివ్యాంగుల పాత్రలు చేసి మెప్పించిన హీరోయిన్ల గురించి ఇప్పుడు చూద్దాం.

#1. రమ్యకృష్ణ:

Ramya Krishnan: చిన్నా పెద్దా అన్ని సినిమాలకు కమర్షియల్ ఎలిమెంట్‌గా ఎవర్‌ గ్రీన్ క్వీన్ | Senior heroine ramya krishna upcoming movies update | TV9 Telugu

సీనియర్ నటి రమ్యకృష్ణ ఎన్నో అద్భుతమైన సినిమాల్లో నటించి తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యారు. రమ్యకృష్ణ అల్లుడుగారు సినిమాలో మూగ అమ్మాయి పాత్ర చేశారు. నిజంగా ఆ పాత్రలో ఆమె ఎంతో అద్భుతంగా నటించడం జరిగింది. దీంతో మంచి ప్రేక్షకాదరణ కూడా పొందారు రమ్యకృష్ణ.

#2. సిమ్రాన్:

ఈ అందాల భామ కూడా దివ్యాంగుల పాత్ర చేసి మెప్పించారు. సాధారణంగా ఇలాంటి పాత్రలు చేయడం మామూలు విషయం కాదు. నువ్వు వస్తావని సినిమాలో అంధురాలు పాత్రలో సిమ్రాన్ నటించి మంచి హిట్ ని అందుకున్నారు.

#3. మీనా:

South Indian starlet Meena shares throwback picture with Bollywood Superstar - IBTimes India

బాలనటిగా మీనా అంధురాలు పాత్ర చేసి అద్భుతంగా నటించారు. ఆ తర్వాత రెండు తమిళ చిత్రాల్లో ఈమె అంధురాలిగా చేశారు.

#4. లయ:

Actress Laya Injured In US Car Accident | Laya | Telugu Actress

లయ కూడా అంధురాలిగా చేసి తెలుగు ప్రేక్షకులను మెప్పించారు. ప్రేమించు సినిమాలో ఈమె అంధురాలుగా నటించారు. ఆ సినిమాకు ఆమెకి నంది అవార్డు కూడా వచ్చింది.

#5. శ్రీదేవి:

వసంత కోకిల సినిమా లో మతిస్థిమితం లేని అమ్మాయి పాత్రలో శ్రీదేవి నటించారు. అలానే ఎస్.పి.పరశురాం చిత్రంలో అంధురాలిగా చేశారు.

#6. అనుష్క:

నిశ్శబ్దం సినిమా ద్వారా మూగ పాత్రలో నటించిన అనుష్క శెట్టి గొప్ప ప్రేక్షకాదరణ పొందారు. నిజంగా ఇటువంటి పాత్రలు చేయడం మామూలు విషయమా..!

#7.నయనతార:

Nayantara To Do Ghost Thriller Once Again | NETTV4U

నయనతార నెట్రికన్ సినిమాలో అంధురాలి పాత్ర చేసి అదరగొట్టింది. ఈ చిత్రం ఓటీటీ లో విడుదల అయ్యింది.

#8. పాయల్ రాజ్ పుత్:

పాయల్ రాజ్ పుత్ రవితేజ హీరోగా నటించిన డిస్కో రాజా సినిమాలో ఒక మూగ అమ్మాయి పాత్ర చేసింది. అలానే రాశి, జ్యోతిక, జయప్రద, షావుకారు జానకి వంటి ఎంతో మంది హీరోయిన్లు దివ్యాంగులుగా మెప్పించారు.


End of Article

You may also like