సినిమా ఫ్లాప్ అవ్వడంతో…తమ రెమ్యూనరేషన్ ని తిరిగి ఇచ్చేసిన 7 మంది స్టార్స్.! ఏ సినిమాకంటే.?

సినిమా ఫ్లాప్ అవ్వడంతో…తమ రెమ్యూనరేషన్ ని తిరిగి ఇచ్చేసిన 7 మంది స్టార్స్.! ఏ సినిమాకంటే.?

by Megha Varna

Ads

హీరో, హీరోయిన్లు తమ రేంజ్ ని బట్టి రెమ్యూనరేషన్ తీసుకోవడం జరుగుతుంది. పైగా సినిమాని బట్టీ కూడా హీరో, హీరోయిన్లు రెమ్యూనరేషన్ తీసుకుంటారు. అయితే కొన్ని కొన్ని సార్లు సినిమాకి నష్టం వస్తే అప్పుడు హీరో, హీరోయిన్లు తమ రెమ్యునరేషన్ ని పూర్తిగా నిర్మాతలకి ఇచ్చేస్తారు లేదా అందులో కొంచెం అయినా సరే ఇస్తారు.

Video Advertisement

అయితే టాలీవుడ్ లో కూడా రెమ్యునరేషన్ ని తిరిగి వెనక్కి ఇచ్చేసిన హీరోలు, హీరోయిన్లు ఉన్నారా..? అవునండి టాలీవుడ్ లో కూడా రెమ్యూనరేషన్ ని వెనక్కి ఇచ్చేసిన వారూ ఉన్నారు. మరి ఆ నటులు ఎవరు అనేది ఇప్పుడు చూద్దాం.

#1. రామ్ చరణ్ తేజ్:

రామ్ చరణ్ తేజ్ ఆరంజ్ సినిమాలో నటించారు. అయితే ఆ సినిమా ఫ్లాప్ అవ్వడం వల్ల నిర్మాతకి రెమ్యూనరేషన్ లో 90% తిరిగి ఇచ్చేశారు చరణ్. అలానే వినయవిధేయరామ తరవాత దానయ్య మరియు రామ్ చరణ్ డిస్ట్రిబ్యూటర్లకు 5 కోట్లు తిరిగి ఇచ్చారు.

#2. పవన్ కళ్యాణ్:

పవన్ కళ్యాణ్ కూడా నిర్మాతలకి తిరిగి వెనక్కి డబ్బులు ఇచ్చిన రోజులు ఉన్నాయి. పవన్ కళ్యాణ్ నటించిన జానీ, పులి సినిమాలు ఫ్లాప్ అవ్వడం వల్ల రెమ్యూనరేషన్ లో 40 శాతం నిర్మాతలకి తిరిగి ఇచ్చేశారు పవన్ కళ్యాణ్ .

#3. జూనియర్ ఎన్టీఆర్:

జూనియర్ ఎన్టీఆర్ కూడా రెమ్యూనరేషన్ వెనక్కి ఇచ్చిన రోజులు ఉన్నాయి. నరసింహుడు సినిమా ప్లాప్ అయిన తర్వాత జూనియర్ ఎన్టీఆర్ రెమ్యూనరేషన్ లో సగాన్ని నిర్మాతలకు ఇచ్చేశారు.

#4. మహేష్ బాబు:

సూపర్ స్టార్ మహేష్ బాబు ఖలేజా సినిమా ఫ్లాప్ అయిన తర్వాత తాను తీసుకున్న రెమ్యూనరేషన్ లో సగ భాగాన్ని నిర్మాతకు ఇచ్చేశారు మహేష్.

#5. త్రివిక్రమ్:

త్రివిక్రమ్ అజ్ఞాతవాసి సినిమా తర్వాత ఇరవై శాతం రెమ్యునరేషన్ ని నిర్మాతకు ఇచ్చేశారు.

#6. సాయి పల్లవి:

పడి పడి లేచే మనసు సినిమా ఫ్లాప్ అయిన తర్వాత హీరోయిన్ సాయి పల్లవి కూడా తన రెమ్యూనరేషన్ మొత్తాన్ని నిర్మాతలకు ఇచ్చేసింది.

#7. బాలకృష్ణ:

గౌతమీపుత్ర శాతకర్ణి సినిమా అనుకున్నంత హిట్ అందకపోవడంతో బాలకృష్ణ తన రెమ్యూనరేషన్ లో సగం ఇచ్చేశారు.


End of Article

You may also like