Ads
తమ అభిమాన హీరో పుట్టినరోజు లేదా సినిమా రిలీజ్ రోజు సందర్భంగా ఫ్యాన్స్ స్పెషల్ షోలు వేయడం అనేది ఈమధ్య ఓ ట్రెండ్‌లా మారిపోయింది. ఇటీవల మహేష్, పవన్ పుట్టిన రోజులకు ఇలా చేసారు.
ఈ నెల 23న రెబల్ స్టార్ ప్రభాస్ బర్త్ డే కావడంతో అతడి సూపర్ హిట్ సినిమా అయిన “వర్షం” మరియు “బిల్లా” సినిమాలను విడుదల చేయడానికి మూవీ మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు.
Video Advertisement
రీ రిలీజ్ లతో వచ్చే డబ్బుని ట్రస్ట్ లకు వంటి వాటికి దానం చేస్తామని విడుదల చేసే ముందు చిత్ర బృందాలు చెబుతున్నాయి. తమ హీరో పేరు చెప్పుకుని ట్రస్ట్ కు డబ్బులు దానం చేస్తున్నాము అనే ఫీలింగ్ తో అభిమానులు కూడా టికెట్ లు తెగ కొనేస్తున్నారు. అయితే ఓ సినిమాని రీ రిలీజ్ చేసే ముందు .. ఆ చిత్ర బృందాలు ఓ విషయాన్ని గుర్తు పెట్టుకోవాలి.
అసలు విడుదల చేయాలి అనుకున్న సినిమాలో ఫ్యాన్స్ స్టఫ్ ఎంత ఉంది అనేది కూడా చెక్ చేసుకోవాలి. ఇటీవల ప్రభాస్ నటించిన రెబల్ సినిమాని రీ రిలీజ్ చేశారు.
రెబల్ సినిమాలో ఒకటి రెండు సీన్లు తీసేస్తే ఫ్యాన్స్ ను డిజప్పాయింట్ చేసే సన్నివేశాలే అందులో ఎక్కువ. అలాగే బిల్లా చిత్రాన్ని కూడా రీ రిలీజ్ చేయబోతున్నారు. ఈ సినిమా పై అభిమానులకే ఆసక్తి లేదు. ఏ మిర్చి, ఛత్రపతి వంటివి అయితే పర్వాలేదు. కనీసం యోగి, బుజ్జిగాడు వంటి చిత్రాల్లో అయినా బోలెడంత ఫ్యాన్స్ స్టఫ్ ఉంటుంది. ప్రభాస్ అనే కాదు ఏ హీరో సినిమా రీ రిలీజ్ చేయాలి అన్నా మేకర్స్ ఇవి గుర్తుంచుకుంటే బెటర్.
End of Article