అల్లుడు అత్తగారింట్లో అస్సలు చేయకూడని… పనులు ఏంటో తెలుసా..?

అల్లుడు అత్తగారింట్లో అస్సలు చేయకూడని… పనులు ఏంటో తెలుసా..?

by kavitha

Ads

సాధారణంగా కోడలికి అయిన అల్లుడికి అయినా అత్త గారిల్లు అంటారు. కానీ మామ గారి ఇల్లు అని ఎక్కడా ఎప్పుడు అనరు. మనది పితృస్వామ్య వ్యవస్థ అయినప్పటికీ కూడా అత్తగారిల్లు అనే పిలుస్తారు.

Video Advertisement

కోడలు అత్తవారింట్లో ఉండడం మనకు తెలిసిందే. వివాహం అయిన తరువాత ఆమె ఇల్లు అదే. ఇల్లరికం వెళ్ళిన అల్లుడు అత్త గారింట్లోనే ఉంటూ పనులు కూడా చేస్తుంటాడు. అలా వెళ్లని అల్లుడు మాత్రం పండుగలు, వేడుకలు, కొన్ని సమయాలలో మాత్రమే అత్తవారింటికి వెళ్తుంటారు. అయితే అత్తగారింటీకి వెళ్ళిన అల్లుడు చేయకూడని పనులు ఏమిటో ఇప్పుడు చూద్దాం..
మన పితృస్వామ్య వ్వవస్థ కుటుంబంలో అల్లుడూ, కోడలు ఇద్దరూ వేరే కుటుంబాల నుండి వచ్చినప్పటికీ, కోడలికి కుటుంబ బాధ్యతను, అల్లుడికి అయితే హోదా ఇచ్చింది. ఇక ఇల్లరికం వెళ్ళిన అల్లుడు అయితే బాధ్యతలో కోడలితో సమానంగా చూస్తారు. అందువల్లనే ఇల్లరికపు అల్లుడిని ఇంటికి పెద్ద పాలికాపు అని అంటారు. సాధారణంగా ఎవరింటి కైనా వెళ్ళినపుడు అతిథి పాటించే నియమాలన్నీ కూడా అల్లుడికి అత్తవారింటికి వెళ్ళిన సమయంలో వర్తిస్తాయని చెప్పచ్చు.

# ఇక అత్తగారింట్లో ఇళ్లరికపు అల్లుడు కానట్లయితే అల్లుడు చుట్టపు చూపుగా మాత్రమే వెళ్ళాలి. అప్పుడే ఆ అల్లుడికి  మర్యాద, విలువ ఎక్కువ.

# అల్లుడు అత్తవారింటికి వెళ్ళినపుడువారి కుటుంబ విషయాలలో జోక్యం చేసుకోకుదు.

# అల్లుడు ఎంత దూరం నుండి వస్తే అంత ఎక్కువ విలువ.

# అల్లుడు ఎంత బెట్టు చేస్తే అంత లెవెల్ లో చూస్తారు.

# అత్తగారింట్లో అడగకుండా అల్లుడు సలహాలు ఇవ్వకపోవడం మంచిది.

# అల్లుడు డబ్బు వ్యవహారాల్లో తల దూర్చకూడదు.

# అత్తగారింట్లో భార్య చేసే పనులను ఓపిగ్గా భరించాలి.

# అత్తగారింట్లో వారి ప్లాన్స్ ని అల్లుడు మార్చమని చెప్పపోవడం మంచిది.

# అత్తగారు చేసిన వంతలకు వంకలు పెట్టకపోవడం.

# అత్తగారింట్లో దురుసుగా వ్యవహరించకూడదు.

# ఆరోపణలు చేయకూడదు.

# ఇతరులకు ఇబ్బంది కలిగించడం లాంటివి చేయకూడదు.

ఇవన్నీ కొందరు చెప్పిన అభిప్రాయాలు మాత్రమే. వాస్తవంగా అయితే అల్లుడు, అత్తవారింటిలో ఉండేవారి మధ్య ఉండే అనుబంధాన్ని బట్టి ఉంటాయి.

Also Read: మీ వైవాహిక జీవితంలో తరచుగా గొడవలు అవుతున్నాయా..? అయితే ఈ 6 సూత్రాలు తప్పకుండా పాటించండి..!


End of Article

You may also like