Ads
ప్రతీ మనిషి జీవితంలో కుటుంబం చాలా ముఖ్యం.తల్లి కడుపులో నుండి బయటకి వచ్చిన దగ్గరనుండీ, అక్క చెళ్ళెళ్ళు, అన్న దమ్ములు, భార్య ఇలా పలు రూపాలలో మనిషి జీవితం లో కుటుంబం ఒక ముఖ్య భూమిక పోషిస్తుంది. మనిషి కష్ట సుఖాలలో తోడుండేది కుటుంబమే, ఒక్క మాటలో చెప్పాలంటే కుటుంబ సభ్యులే ప్రతీ మనిషికీ మొట్టమొదట పరిచయమయ్యే వ్యక్తులు.
Video Advertisement
అయితే కొన్ని కారణాల వల్ల ఉమ్మడి కుటుంబాలు చాలా మందికి ఒక సమస్య గా లేదా భారంగా పరిణమించాయి. వాటికి ఎన్నో కారణాలు ఉన్నాయి. అయితే మన జీవితం లో ఎన్నో కష్టాలు ఎదురవుతూ ఉంటాయి.. వాటిని దాటుకుంటూ ముందుకు సాగుతూ ఉంటాం. అయితే కొన్ని కష్టాలకు మన సొంత వారే కారణం అయినపుడు అది మనకు ఇంకా బాధని కలిగిస్తుంది.
ఇటువంటి సందర్భాల్లో వాటిని ఎలా ఎదుర్కోవాలో ఇప్పుడు చూద్దాం..
#1 నాణేనికి రెండు వైపులా ఆలోచించడం
ప్రతి విషయానికి రెండుకోణాలు ఉంటాయి. మంచి.. చెడు.. లాగే. అందుకే ప్రతి విషయాన్నీ అవతలి వారు చెప్పే కోణం లో కూడా ఆలోచించాలి. అందుకే మనకి నచ్చిన కోణం లో కాకుండా సరైనది ఎదో ఆ మార్గాన్నే మనం ఎంచుకోవాలి. ఎందుకు నా సొంతవారే ఇలా నన్ను తప్పు పడుతున్నారు అని బాధ పడటం మానెయ్యాలి.
#2 పరిస్థితులని అర్థం చేసుకోవాలి..
మనం ఏదైనా కొలను లోకి దిగినప్పుడు చేపలు మనల్ని కొరుకుతూ ఉంటాయి. అవి మనకు హాని చేస్తున్నాయి అనుకుంటాం కానీ.. అవి మన చర్మం పై ఉన్న మృతకణాలను శుభ్రం చేస్తాయి.. అలాగే మన ఇంట్లో వాళ్ళు కూడా మనకి మంచి చెయ్యాలని చూస్తే మనం వారిని అపార్థం చేసుకొనే అవకాశం ఉంది. అందుకే పరిస్థితులని అర్థం చేసుకోవడం ముఖ్యం..
#3 స్వభావాలను తెలుసుకోవాలి..
ప్రతి మనిషి వారికీ నచ్చినట్లు ప్రవర్థించడం వారి సహజ స్వభావం. మనకి కొంత మంచి వల్ల ఇబ్బంది ఉన్నట్లే.. మన వల్ల కూడా కొందరికి ఇబ్బందులు ఉంటాయి. కానీ మన సొంత వారు మనలోని తప్పులను చెప్పి ఇతరుల్లో మనం చులకన కాకుండా చూస్తారు. అందుకే మనం వారు చెప్పే విధానం లో తప్పులు ఎంచకుండా.. వారు ఏం చెప్తున్నారో తెలుసుకోవాలి.
#4 ఎదుటి వారి స్థానం లో ఉండి ఆలోచించడం
ఒకరిని మార్చడం మన చేతిలో లేనపుడు.. ఆ పరిస్థితిని చక్క దిద్దే నేర్పు మనలో ఉండాలి. బాధ పడటం వల్ల ఉపయోగం ఉండదు. దాని వల్ల సమస్యకి పరిష్కారం దొరకదు. అందుకే ఆ పరిస్థితిని వేరే వారి కోణం లో ఉండి చూడటం నేర్చుకోవాలి. అప్పుడే మనకి అవగాహనా, మానసిక స్థిరత్వం వస్తుంది.
#5 అన్నిటికి సిద్దపడి ఉండటం
ముందుగా మనం మన మైండ్ ని అన్నిటికి సిద్ధం చేసుకోవాలి. మన ఆలోచనలే మన చేతలను ప్రభావితం చేస్తాయి. అందుకే పాజిటివ్ గా ఆలోచించడం నేర్చుకోవాలి. మనం బాధ పడుతున్నాం అని ఎదుటి వారు మనకి నచ్చినట్లు మాట్లాడరు. అందుకే మనం స్ట్రాంగ్ గా ఉండాలి.
#6 అంచనాలు పెట్టుకోకూడదు
ఎటువంటి ఎక్సపెక్టషన్స్ పెట్టుకోకుండా మనం చెయ్యాల్సిన పనిని పూర్తి చెయ్యాలి. అప్పుడే మనకి మంచి ఫలితాలు వస్తాయి. అందుకే ఏ విషయం గురించి ఎక్సపెక్టషన్స్ పెట్టుకోకూడదు. మన భాగస్వామి లేక తోబుట్టువు మారాలి అని ఆశించకుండా మనం చేసే పనిని మంచి గా చెయ్యాలి.
#7 కుటుంబమే మన బలం
మన ఆలోచనలు ఎప్పుడు పాజిటివ్ గా ఉండాలి. అప్పుడే మనకి కావాల్సిన వారు చెప్పే విషయాలను అర్థం చేసుకోగలం. వారు కాస్త రూడ్ గా చెప్పినా.. ఆ విషయాలు మన మంచి కోసమే అని తెలుసుకోవాలి.
#8 మంచి అలవాట్లు అలవరచుకోండి
నచ్చిన పనులో.. లేక మంచి జీవన శైలిని అలవరచుకోవడం వల్ల మనకు నెగటివ్ ఆలోచనలు రాకుండా ప్రతిదీ అర్థవంతం గా కనిపిస్తుంది. అప్పుడు మన వాళ్ళు చెప్పే మంచి మంకు అర్థం అవుతుంది.
End of Article