“కల్కి 2898 ఏడి” లో అర్జునుడిగా ఈ హీరో..? సూట్ అవుతారా..?

“కల్కి 2898 ఏడి” లో అర్జునుడిగా ఈ హీరో..? సూట్ అవుతారా..?

by Harika

Ads

ప్రభాస్ హీరోగా, నాగ్ అశ్విన్ దర్శకత్వంలో రూపొందుతున్న కల్కి 2898 ఏడి సినిమా మీద భారీగా అంచనాలు నెలకొన్నాయి. ఇటీవల ఈ సినిమా ట్రైలర్ విడుదల చేశారు. దానికి చాలా మంచి స్పందన వచ్చింది. వైజయంతి మూవీస్ వారు ఈ సినిమాని నిర్మిస్తున్నారు. సినిమా ప్రమోషన్స్ మొదలుపెట్టారు. ఇంటర్వ్యూలు ఇస్తున్నారు. సినిమాలో ప్రభాస్ తో పాటు, దీపికా పదుకొనే, దిశా పటాని, అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ కూడా ఉన్నారు. వారు కూడా ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమాలో కొంత మంది అతిథి పాత్రల్లో కూడా కనిపించబోతున్నారు. వారిలో ముందుగా మాట్లాడుకోవాల్సింది దుల్కర్ సల్మాన్, మృణాల్ ఠాకూర్, విజయ్ దేవరకొండ గురించి. వీరి పేర్లు గట్టిగా వినిపిస్తున్నాయి.

Video Advertisement

అలాగే వీరితో పాటు, నాని కూడా ఈ సినిమాలో ఒక పాత్రలో కనిపిస్తారు అని అంటున్నారు. ఇందులో ఎంత వరకు నిజం ఉంది అనేది కూడా తెలియదు. అయితే, విజయ్ దేవరకొండ ఈ సినిమాలో అర్జునుడి పాత్ర పోషిస్తారు అని అంటున్నారు. విజయ్ దేవరకొండకి అర్జునుడి పాత్ర సూట్ అవుతుందా అనే ఆలోచన అందరిలో నెలకొంది. మిగిలిన వాళ్ళు ఏం పాత్రలు చేస్తున్నారు అనేది తెలియదు. కానీ ఒకవేళ విజయ్ దేవరకొండ అర్జునుడి పాత్ర పోషిస్తే ఆ పాత్ర విజయ్ దేవరకొండ కి ఎలా ఉంటుంది? విజయ్ దేవరకొండ ఈ పాత్రకి ఎంత వరకు నప్పుతారు? అనే విషయం అందరూ ఆలోచిస్తున్నారు.

కానీ కొంత మంది మాత్రం మరొక రకంగా కామెంట్స్ చేస్తున్నారు. “నాగ్ అశ్విన్ సినిమాకి తగ్గట్టు పాత్రలని మార్చుకోగలుగుతారు. కాబట్టి ఈ సినిమాలో విజయ్ దేవరకొండ అర్జునుడి పాత్ర పోషించినా కూడా ఆ పాత్రకి తగ్గట్టుగానే నాగ్ అశ్విన్, విజయ్ దేవరకొండని మారుస్తారు” అని అంటున్నారు. ప్రస్తుతం విజయ్ దేవరకొండ జెర్సీ డైరెక్టర్ గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో రాబోతున్న సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమా తర్వాత రాజా వారు రాణి గారు, అశోక వనంలో అర్జున కళ్యాణం సినిమాలకు దర్శకత్వం వహించిన రవికిరణ్ కోలా దర్శకత్వంలో కూడా మరొక సినిమాలో నటిస్తారు.


End of Article

You may also like