Ads
ఇప్పుడు అందరూ ఎక్కువగా ప్యాన్ ఇండియా సినిమాలపై పడ్డారు కాబట్టి ఒక్కో సినిమాకి చాలా ఏళ్ళు టైం పడుతుంది. ఈలోపు వస్తే ఏదైనా చిన్న హీరోల సినిమాలు ఫ్యామిలీ ఎంటర్టైనర్ సినిమాలు ఎక్కువగా వస్తున్నాయి.
Video Advertisement
అలా ప్రజలకు ఎంటర్టైన్మెంట్ కు కొదవ లేదు. కాకపోతే కొందరు స్టార్ హీరోల సినిమాలు చూడాలంటే ఏళ్ల తరబడి వేచి ఉండాల్సిన పరిస్థితి. కానీ మెగా స్టార్, బాలయ్య అందరికీ పోటీగా హిట్ ఫ్లాపులతో సంబంధం లేకుండా వరుస సినిమాలతో దూసుకు పోతున్నారు. ముఖ్యంగా చిరంజీవి విషయానికి వస్తే గ్యాప్ లేకుండా కుమ్మేస్తున్నారు. కమ్ బ్యాక్ తర్వాత మళ్ళీ పాతికేళ్ల కుర్రాడిలా హుషారుగా పని చేస్తున్నారు.
ప్రస్తుతం మలయాళంలో భారీ హిట్ కొట్టిన వేదాలం సినిమాకు రీమేక్ గా మెహర్ రమేష్ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తి చేసుకుని ప్రమోషన్స్ కూడా మొదలు పెట్టింది. ఇక ఆగస్ట్ 11న గ్రాండ్ గా రిలీజ్ కానుంది. ఇదిలా ఉంటే అమ్మడు లెట్స్ డూ కుమ్ముడు అన్నట్టు… డైరెక్టర్స్ లెట్స్ స్టార్ట్ దూకుడు అంటున్నారు మన మెగా స్టార్ చిరు. ఒక సినిమా పనిలో ఉంటూనే ఇంకో సినిమాతో పాట్టాలెక్కేందుకు సిద్ధపడ్డారు. వెంటనే బంగార్రాజు డైరెక్టర్ కళ్యాణ్ కృష్ణ కురసాలతో సినిమా చేసేందుకు ఓకే చెప్పేశారట.
అయితే ఈ సినిమా కూడా మలయాళంలో సూపర్ హిట్ కొట్టిన “బ్రో డాడీ” కి రీమేక్ గా తరకెక్కిస్తున్నారు. ఇందులో చిరంజీవి సరసన త్రిషను అనుకున్నట్లు వార్తలు వచ్చాయి. ఈ సినిమాను చిరంజీవి కూతురు సుస్మిత కొణిదెల నిర్మించబోతుందని సమాచారం. ఇదిలా ఉంటే ఈ సినిమాలో ఒక యంగ్ హీరో పాత్ర కూడా ఉందట. దానికి మొదట సిద్దు జొన్నలగడ్డను అనుకోగా…తన పక్కన శ్రీ లీలను అనుకున్నారట. కానీ తనకు డేట్స్ కుదరకపోవడంతో చిరు తో ఛాన్స్ మిస్ చేసుకున్నాడు సిద్ధు.
ఇక నెక్ట్స్ ఎవరైతే బాగుంటుందని ఆలోచిస్తుండగా… రామ్ చరణ్ ప్రియ మిత్రుడు శర్వానంద్ అయితే బాగుంటుందని చిరంజీవి ఫిక్స్ చేశారు. ఈ క్రేజీ కాంబినేషన్ వినగానే అభిమానుల్లో ఉత్కంఠ పెరిగింది. కాకపోతే ఇందులో అనుకున్న క్యారెక్టర్ల ప్రకారం చిరంజీవి త్రిష భార్య భర్తలుగా నటిస్తే… వీరికి కొడుకుగా శర్వానంద్ అంటే త్రిషకు శర్వానంద్ కొడుకు అంటే సరిగ్గా ఉంటుందా అనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.
ఒకవైపు సిద్ధు జొన్నలగడ్డ చాలా యంగ్ హీరో అండ్ తన డిఫరెంట్ లుక్ యాటిట్యూడ్ తో మెగా స్టార్ పక్కన చేస్తే కాంబినేషన్ కొత్తగా ఉంటుంది అనుకుంటున్నారు అందరూ. ఇటు శర్వానంద్ అనగానే సాఫ్ట్ గా ఉండే హీరోల బాగుంటాడు అనే కామెంట్లు కూడా వినిపిస్తున్నాయి. చూడాలి మరి చివరకు ఎవరు ఫిక్స్ అవుతారో. మొత్తానికి ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులు మొదలవ్వగా… చిరంజీవి పుట్టిన రోజు సందర్భంగా సినిమా మొదలు పెడుతున్నట్లు సమాచారం. ఇక ఈ సినిమాను వచ్చే సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు.
ALSO READ : రామ్ చరణ్ కూతురు క్లిన్ కారా కు బన్నీ అదిరిపోయే గిఫ్ట్… అదేంటో తెలుసా??
End of Article