ఈ ఫోటోలో ఉన్న అబ్బాయి ఇప్పుడు తెలుగు ఇండస్ట్రీనే ఏలేస్తున్నాడు..! ఎవరో తెలుసా..?

ఈ ఫోటోలో ఉన్న అబ్బాయి ఇప్పుడు తెలుగు ఇండస్ట్రీనే ఏలేస్తున్నాడు..! ఎవరో తెలుసా..?

by Mounika Singaluri

ఈ ఫోటోలో మధ్యలో కనిపిస్తున్న అబ్బాయి సినీ రాజకీయ చరిత్ర ఉన్న కుటుంబానికి చెందిన అతను. ఈయన తండ్రి తెలుగు చిత్ర సీమలో అగ్ర హీరోగా వెలుగొంది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కి సీఎంగా కూడా పనిచేశారు. ప్రస్తుతం ఈయన హిందూపూర్ ఎమ్మెల్యేగా ఉన్నారు. తాజాగా ఆయన సినిమా దసరాకి బ్లాక్ బస్టర్ అయింది. అర్థమైంది కదా ఆయన నందమూరి బాలకృష్ణ అని.

Video Advertisement

నందమూరి తారకరామారావు వారసుడిగా తెలుగు చిత్రంలోకి అడుగుపెట్టి తనకంటూ ఒక సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్న బాలకృష్ణ రాజకీయాల్లో కూడా తమ కుటుంబ వారసత్వాన్ని కొనసాగిస్తున్నారు. తెలుగులో ఎన్నో సూపర్ హిట్ సినిమాలు అందించారు.

బాలయ్యది అంటే చిన్న పిల్లల మనస్తత్వం అని చాలామంది చెబుతూ ఉంటారు. ముక్కు సూటితనానికి బాలకృష్ణ పెట్టింది పేరు. లోపల ఏముంచుకోకుండా మనసులో ఏది అనిపిస్తే అది మాట్లాడేస్తుంటారు.తాజాగా దసరాకి భగవంత్ కేసరి సినిమాతో సూపర్ హిట్ కొట్టారు. బాలకృష్ణ కుమారుడు నందమూరి మోక్షజ్ఞను త్వరలో తెలుగు చిత్రసీమలోకి పరిచయం చేయనున్నట్లు ప్రకటించారు.

బాలయ్య పేరు మీద వచ్చిన జై బాలయ్య స్లోగన్ తెలుగువారు ఎక్కడున్నా కూడా మార్మోగిపోతూ ఉంటుంది. ఏ ఈవెంట్ జరిగిన సరే జై బాలయ్య అనే మాట వినపడకుండా ఆ ఈవెంట్ పూర్తి అవ్వదు. మాస్ లో బాలకృష్ణకి మంచి క్రేజ్ ఉంది. తాజాగా బాలయ్య చిన్ననాటి ఫోటో ఒకటి ఇంటర్నెట్ లో బాగా వైరల్ అవుతుంది. ఆ ఫోటో చూసిన అభిమానులు బాలయ్య చిన్నప్పుడు కూడా భలే ముద్దుగా ఉన్నాడే అంటూ మురిసిపోతున్నారు.

ప్రస్తుతం బాలకృష్ణ బాబీ దర్శకత్వంలో ఒక సినిమాలో నటిస్తున్నారు. దీన్ని సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పైన నాగవంశీ నిర్మిస్తున్నారు. బాలయ్య పేరు మీద ఎన్ని విమర్శలు వచ్చినా ఎవరు ఎన్ని కామెంట్లు చేసిన ఐ డోంట్ కేర్ అంటూ వారికి సమాధానం చెబుతూ ఉంటారు. ఆరు పదుల వయసులో కూడా కుర్ర హీరోలకి పోటీ ఇచ్చే ఎనర్జీ బాలయ్య సొంతం.

Also Read:లక్ష్మీ పార్వతి వల్ల మంచి జరగలేదు..! మా ఫ్యామిలీలోకి ఒక శని వచ్చింది” అంటూ… “నందమూరి చైతన్య కృష్ణ” కామెంట్స్..!


You may also like

Leave a Comment