Ads
సోషల్ మీడియాలో ప్రతిరోజు ఏదో ఒక ఫోటో వైరల్ అవుతూ ఉంటుంది. సినిమా హీరోదో ,క్రికెటర్ దో, లేదా రాజకీయ నాయకుడిదో ఏదో ఒక ఫోటో వచ్చి హల్ చల్ చేస్తూ ఉంటుంది. చాలామంది ఆ ఫోటోను చూసి అరే ఇది ఇతనా అంటూ ఇట్టే గుర్తుపట్టేస్తారు.
Video Advertisement
మరికొందరికి అయితే కష్టతరంగాను ఉంటుంది. అలాంటి ఫోటో ఒకటి ఇప్పుడు సోషల్ మీడియాలో తిరుగుతుంది. ఇంతకీ అతని ఎవరో తెలుసా….?
అవును మీ గెస్ కరెక్టే. మన తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్. దేశంలో ప్రతి ఒక్కరికి కెసిఆర్ గురించి తెలిసిందే. మాస్ లీడర్ అంటే గుర్తొచ్చే పేరు కేసీఆర్.రెండుసార్లు తెలంగాణ ముఖ్యమంత్రిగా పనిచేసి ఇప్పుడు టిఆర్ఎస్ పార్టీ పేరుతో దేశవ్యాప్తంగా తన ప్రభావాన్ని చూపడానికి సిద్ధమయ్యారు.తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించి ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం సాధించే వరకు తన ప్రాణాలను సైతం వదిలేస్తానని నిరాహార దీక్ష చేసి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించారు. ప్రత్యేక తెలంగాణ ఏర్పడ్డ తొలి ముఖ్యమంత్రిగా కెసిఆర్ రికార్డులకు ఎక్కారు.
మీడియా సమావేశంలో ఆయన వేసే కౌంటర్లకు ప్రత్యేక అభిమానులు ఉన్నారు. ప్రతిపక్షాలను టార్గెట్ చేయడంలో కూడా ఆయన శైలి తీరు వేరు.కెసిఆర్ చిన్నప్పుడు తన కుటుంబ సభ్యులతో దిగిన ఫోటో అభిమానులను ఎంతగానో అలరిస్తుంది. కెసిఆర్ అభిమానులైతే ఈ ఫోటో చూడగానే గుర్తుపట్టేస్తున్నారు. కెసిఆర్ కుమారుడు కేటీఆర్ ఐటీ మంత్రిగా హైదరాబాద్ మహానగరాన్ని అగ్రిగామిగా నిలబెట్టడంలో తండ్రికి తగ్గ తనయుడు అనిపించుకున్నారు.
కుమార్తె కవిత కూడా రాజకీయాల్లో చురుకుగా పాల్గొంటారు. ప్రస్తుతం ఆమె ఎమ్మెల్సీగా పనిచేస్తున్నారు. తెలంగాణలో ఎన్నికల శంఖారావం మోగడంతో ఈసారి కూడా తమ ప్రభుత్వాన్ని స్థాపిస్తామని కెసిఆర్ ధీమా వ్యక్తం చేశారు.
Also Read:చంద్రబాబు స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో అప్‌డేట్ ఇదే…
End of Article