Ads
అజిత్ కుమార్ సౌత్ ఇండస్ట్రీ బిగ్గెస్ట్ సూపర్ స్టార్. 1993లో తెలుగు మూవీ ప్రేమ పుస్తకంతో ఇండస్ట్రీలో అడుగు పెట్టిన అజిత్, ఆ తర్వాత కోలీవుడ్ కి వెళ్లి, అక్కడ అంచలంచెలుగా ఎదిగి అత్యధిక ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న స్టార్ హీరోగా నిలిచాడు. అజిత్ అభిమానుల సంఖ్య ఊహకు అందని విధంగా ఉంటుందని చెప్పవచ్చు.
Video Advertisement
అజిత్ ను ఫ్యాన్స్ ఆరాధిస్తారు. వారు ప్రేమతో ‘తలా’ అని పిలుస్తారు. సోషల్ మీడియాలో ఎప్పుడూ ట్రెండింగ్‌లో ఉండే స్టార్ అజిత్. కానీ ఆయనకి ఇన్‌స్టాగ్రామ్ లేదా ట్విట్టర్‌లో ఖాతాలు లేవు. అయినప్పటికీ అజిత్ కి సంబంధించిన వార్తలు ట్రెండింగ్ లో ఉంటాయి.
అజిత్ మాత్రమే కాదు , ఆయన కుమారుడు కూడా సోషల్ మీడియాలో ట్రెండ్ అయిన మొదటి స్టార్ కిడ్ గా రికార్డు సృష్టించారు. ఈ ఏడాది తెగింపు సినిమాతో ప్రేక్షకులను పలకరించిన అజిత్, చాలా సాధారణంగా ఉంటారు. స్టార్ హీరో అయినప్పటికీ ఎలాంటి బేజషాలకు పోకుండా నిరాడంబరంగా జీవిస్తారు.
అజిత్ తన సినిమాలను ప్రమోట్ చేయడు. అతనికి ఎలాంటి సోషల్ మీడియా ఖాతాలు లేవు. తన లేదా అతని కుటుంబం యొక్క ఫోటోలను షేర్ చేయడు. అజిత్ కుమార్ హీరోయిన్ శాలినిని ప్రేమించి, పెళ్లి చేసుకున్నాడు. ఈ జంటకి ఇద్దరు పిల్లలు, కుమార్తె అనౌష్క, కుమారుడు ఆద్విక్. స్టార్ డమ్ ఉన్నప్పటికీ, ఈ కుటుంబం మీడియాకు, సోషల్ మీడియాకు దూరంగా ఉండటానికి ప్రయత్నిస్తుంది. అయినప్పటికీ, వారి తండ్రిలాగే, అజిత్ పిల్లలు ఇద్దరూ కూడా పాపులర్ అయ్యారు.
ఆద్విక్‌ని ‘కుట్టి థాలా’ అని అభిమానులు పిలుస్తారు. ఇది హ్యాష్‌ట్యాగ్ నేషనల్ వైడ్ గా ట్విట్టర్‌లో ట్రెండ్ అయ్యింది. ఇది సిని నేపథ్యం ఉన్న ఫ్యామిలిలో చిన్న వయస్సులో ట్విట్టర్‌లోకి ట్రెండ్ అయిన మొదటి అబ్బాయిగా ఆద్విక్ రికార్డ్ క్రియేట్ చేశాడు. 2021లో జనవరి 27న 22.4K రీట్వీట్‌ను అందుకున్నాడు.
Also Read: “ఇంటర్వెల్, క్లైమాక్స్ మార్చేశారు..!” అంటూ… “విజయ్” సినిమాపై రాజమౌళి పోస్ట్ చూశారా..?
End of Article