“ఇంటర్వెల్, క్లైమాక్స్ మార్చేశారు..!” అంటూ… “విజయ్” సినిమాపై రాజమౌళి పోస్ట్ చూశారా..?

“ఇంటర్వెల్, క్లైమాక్స్ మార్చేశారు..!” అంటూ… “విజయ్” సినిమాపై రాజమౌళి పోస్ట్ చూశారా..?

by kavitha

Ads

తమిళ ఇండస్ట్రీలో స్టార్ హీరోలలో ఒకరు అయిన విజయ్ దళపతికి ఆడియెన్స్ లో ఊహించని రేంజ్ లో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఆయన నటించిన చిత్రాలలో మెజారిటీ సినిమాలు విజయం సాధించాయి. డబ్బింగ్ సినిమాల ద్వారా తెలుగు ఆడియెన్స్ కూడా సుపరిచితం అయ్యాడు. అలా తెలుగు ప్రేక్షకులు కూడా విజయ్ కి ఫ్యాన్స్ గా మారిపోయారు.

Video Advertisement

విజయ్ ఫ్యాన్స్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. సోషల్ మీడియాలో వారు చేసే హంగామా మామూలుగా ఉండదు. అయితే తాజాగా దర్శకధీరుడు రాజమౌళి గతంలో విజయ్ సినిమా పై ట్వీట్ చేయగా, ఆ స్క్రీన్‌షాట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం..
Thalapathy-Vijay-rajamouliవిజయ్ సినిమాలు ఫలితంతో సంబంధం లేకుండా బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్స్ సాధిస్తాయి. విజయ్ ప్రస్తుతం లోకేష్ కనకరాజ్ దర్శకత్వంలో ‘లియో’ మూవీలో నటిస్తున్నారు. లియో తర్వాత విజయ్ దర్శకుడు వెంకట్ ప్రభుతో కలిసి “తలపతి 68” మూవీలో నటించబోతున్నాడు. వెంకట్ ప్రభు ప్రత్యేకమైన కథనంతో సాగుతాయి. విజయ్‌తో సినిమా అనడంతో విజయ్ ఫ్యాన్స్ లో మరింత ఉత్సాహం పెరిగింది. ఈ డైనమిక్ జోడీ వెండితెరపై ఎలాంటి మ్యాజిక్ క్రియేట్ చేస్తుందో చూడాలని అభిమానులు చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
లియో,  తలపతి 68 కోసం ఎదురుచూస్తున్న విజయ్ అభిమానుల దృష్టిని దర్శకధీరుడు రాజమౌళి చేసిన ట్వీట్ ఒకటి ఆకర్షించింది. బ్లాక్ బస్టర్ చిత్రాలకు పేరుగాంచిన రాజమౌళి గతంలో ప్రభాస్ నటించిన ఛత్రపతి సినిమాకి దర్శకత్వం వహించారు. విజయ్ నటించిన కురువి అనే మూవీ ఛత్రపతి మూవీ నుండి తీసుకోబడింది అని టాక్.

దీనికి సంబంధించి రాజమౌళి ఒక ట్వీట్‌ చేశాడని విజయ్ అభిమానులు స్క్రీన్‌షాట్‌ ను సోషల్ మీడియాలో పోస్ట్‌ చేస్తున్నారు. ఆ ట్వీట్ లో ‘రిలీజ్ తర్వాత చాలా సజెషన్స్ చూశాను. కథ ఆధారంగా ఒక తమిళ చిత్రం (విజయ్ హీరోగా). ఇంటర్వెల్ మరియు క్లైమాక్స్ మార్చబడ్డాయి’ అని రాసుకొచ్చారు. దీనిపై నెటిజెన్లు రకరకాలుగా కామెంట్స్ చేస్తున్నారు.

Also Read: హీరోయిన్ “రాశీ ఖన్నా” కి డబ్బింగ్ చెప్పే వ్యక్తి ఎవరో తెలుసా..? ఇంకా ఎవరెవరికి డబ్బింగ్ చెప్తారు అంటే..?

 


End of Article

You may also like