హీరోయిన్ “రాశీ ఖన్నా” కి డబ్బింగ్ చెప్పే వ్యక్తి ఎవరో తెలుసా..? ఇంకా ఎవరెవరికి డబ్బింగ్ చెప్తారు అంటే..?

హీరోయిన్ “రాశీ ఖన్నా” కి డబ్బింగ్ చెప్పే వ్యక్తి ఎవరో తెలుసా..? ఇంకా ఎవరెవరికి డబ్బింగ్ చెప్తారు అంటే..?

by kavitha

Ads

హీరోయిన్స్ రూపమే కాకుండా వారు చెప్పే డైలాగ్స్ కూడా ప్రేక్షకులను, ముఖ్యంగా వారి అభిమానులను అలరిస్తూ ఉంటాయి. అయితే చాలామంది హీరోయిన్స్ ఇతర భాషల నుండి వచ్చినవారు కావడంతో వారికి డబ్బింగ్ చెప్పేది వేరేవారు అనేది తెలిసిందే.

Video Advertisement

తెర పైన కనిపించేది హీరోయిన్స్ అయినా గాత్రదానం చేసేది మాత్రం డబ్బింగ్ ఆర్టిస్టులే. రాశికన్నా, కాజల్ అగర్వాల్, రష్మిక లాంటి హీరోయిన్లకు గొంతు అరువు ఇచ్చే డబ్బింగ్ ఆర్టిస్టు ప్రియాంక తుంపాల. ఆమె గురించిన  వివరాలు ఇప్పుడు చూద్దాం.. priyankatumpalaప్రియాంక తుంపల టాలీవుడ్ లో ప్రముఖ డబ్బింగ్ ఆర్టిస్ట్ లలో ఒకరు. తాజాగా ఆమె ఒక ఇంటర్వ్యూలో తన గురించి పలు విషయాలను తెలిపారు. ప్రియాంక స్వస్థలం విశాఖపట్నం. తాను ఒక కార్పొరేట్‌ ఉద్యోగినని, బీఏ చేసిన ఆమె ప్రొడక్ట్‌ బ్రాండింగ్‌, ఆర్‌జే, మార్కెటింగ్‌ డిపార్ట్మెంట్ లో పని చేశానని అన్నారు. ఒకసారి పని మీద అన్నపూర్ణ స్టూడియోస్‌కి వెళ్లానని, ఆ సమయంలో ‘విలేజ్‌లో వినాయకుడు’ మూవీ కోసం డబ్బింగ్‌ ఆడిషన్స్‌ నిర్వహిస్తున్నారు. అక్కడే మొదటిసారి డబ్బింగ్‌ ఆర్టిస్ట్‌ల గురించి తెలిసిందని, ఇంట్రెస్టింగ్ గా అనిపించడంతో సరదాగా అందులో పాల్గొన్నాను. డైరెక్టర్‌కి నా గొంతు నచ్చడంతో ఆ మూవీలో అవకాశమిచ్చారు. ఆ మూవీనే నా ఫస్ట్ మూవీ అని తెలిపారు. వర్క్ నచ్చడంతో డబ్బింగ్ ను కొనసాగించానని అన్నారు. డబ్బింగ్ ఆర్టిస్ట్ గా గత 15 ఏళ్లుగా చాలా మంది ప్రముఖ హీరోయిన్లకు డబ్బింగ్ చెప్పానని, అలా మంచి గుర్తింపు వచ్చిందని అన్నారు.అలా ప్రియాంక తుంపాల కాజల్ అగర్వాల్, రాశికన్నా, తమన్నా, సాయిపల్లవి, పూజా హెగ్దే, రష్మిక, రెజీనా, నభా నటేష్‌, ఐశ్వర్య లక్ష్మి, అనన్యపాండే, కేతిక శర్మ వంటి ఎంతోమంది కథానాయకలకు గాత్రదానం చేసింది. ఆమె  తెలుగు, హిందీ మాత్రమే కాకుండా డిస్నీ, మార్వెల్ వంటి హాలీవుడ్ సంస్థలకూ ప్రియాంక జర్నీ సాగింది. అలా కెప్టెన్ మార్వెల్, జంగిల్ క్రూజ్, ఎటర్నల్స్, ఎవెంజర్స్ ఎండ్ గేమ్, ఇండియానా జోన్స్ అండ్ ది డయల్ ఆఫ్ డెస్టినీ చిత్రాలకు కూడా పని చేసారు. ఆమె కెరీర్ లో ఇప్పటివరకు దాదాపు 150కి పైగా చిత్రాలకు వర్క్ చేసారు.

Also Read: “భరత్ అనే నేను” సినిమాలో “శుభోదయం సుబ్బారావు” గా నటించిన నటుడు ఎవరో తెలుసా..?


End of Article

You may also like