అల్లు అర్జున్, రష్మిక జంటగా వచ్చిన పాన్ ఇండియన్ మూవీ పుష్ప సూపర్ హిట్ అయ్యింది. మొత్తం దేశాన్నే షేక్‌ చేసేసింది ఈ మూవీ. సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన పుష్ప వన్ హిట్ అయ్యాక ఇప్పుడు పుష్ప2 ను ప్రపంచ వ్యాప్తంగా భారీ లెవల్లో రిలీజ్ చేయడానికి చూస్తున్నారు.

Video Advertisement

ఇరవైకి పైగా దేశాల్లో ఈ సినిమా ని ఒకే సారి విడుదల చేయాలనే లక్ష్యం తో పని చేస్తోంది మైత్రీ టీమ్‌ అండ్‌ సుకుమార్‌ టీమ్‌.

2021 డిసెంబర్ 17న పుష్ప వన్ సినిమా విడుదల అయింది. ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ అవుతోంది. ఇది ఇలా ఉంటే ఈ సినిమాలో పోలీస్ ఆఫీసర్ కింద ఫహద్ ఫాజిల్ నటించి బాగా ఆకట్టుకున్నారు. అయితే ఫహద్ ఫాజిల్ ఈ సినిమా నుండి తప్పుకు పోతున్నట్లు తెలుస్తోంది. ఆయనకీ డేట్స్ వేస్ట్ అవడం ఇతర సినిమాల కమిట్మెంట్ ఉండడం వలన ఈ సినిమా లో నటించట్లేదు అని తెలుస్తోంది. ఆయన పాత్ర లో మనోజ్ బాజ్ పాయ్ నటిస్తున్నారని కూడా వార్తలు వినపడుతున్నాయి.

pushpa2-telugu-adda

అయితే ఇది నిజం కాదు వట్టి రుమార్ అని క్లియర్ గా తెలిసి పోతోంది. పుష్ప టు సినిమాలో కేథరిన్ థెరిసా కూడా ఒక నెగిటివ్ రోల్ చేయనున్నారని వార్తలు వస్తున్నాయి. ఇలా ఈ సినిమా లో పాట నటుల తో పాటుగా కొత్త నటులు కూడా కనిపిస్తారని టాక్‌. అంటే మొదటి పార్టు లో లేని పాత్రలు కొత్తగా వస్తాయట. అలానే మరొక వార్త ఏమిటంటే పుష్ప టు లో అదిరిపోయే ఫైట్ ఉండబోతుందట. అల్లు అర్జున్ తన స్నేహితుడిని కాపాడే క్రమం లో సింహం తో ఫైటింగ్ చేస్తారని తెలుస్తోంది. పైగా అది భారీ లెవెల్లో డిజైన్ చేశారని ఆర్ఆర్ఆర్ లో ఎన్టీఆర్ పులి తో చేసిన ఫైట్ కంటే బాగుంటుందని తెలుస్తోంది. అయితే మరి వినపడుతున్న ఈ వార్తలు నిజమా కాదో తెలియాలంటే పుష్ప టు సినిమా వచ్చే దాకా ఆగాల్సిందే.