ఈ ఫోటోలో ఉన్న అమ్మాయి ఇప్పుడు భారతదేశంలోనే గొప్ప సింగర్ అయ్యింది..! ఎవరో కనిపెట్టగలరా..?

ఈ ఫోటోలో ఉన్న అమ్మాయి ఇప్పుడు భారతదేశంలోనే గొప్ప సింగర్ అయ్యింది..! ఎవరో కనిపెట్టగలరా..?

by Mohana Priya

Ads

పాటలు లేకుండా ఈ ప్రపంచాన్ని ఊహించడం చాలా కష్టం. ఒక రోజులో ఒక మనిషి ఎన్ని సార్లు పాటలు వింటాడో కూడా చెప్పలేం. పాటలు పాడుతాడు కూడా. ఇండస్ట్రీలో సింగర్స్ కి కొదవ లేదు. ఒక సంవత్సరంలో సినిమా ఇండస్ట్రీకి ఎంతో మంది సింగర్స్ కూడా పరిచయం అవుతూ ఉంటారు. వారిలో కొంత మంది గొంతులు మాత్రమే ప్రేక్షకులకి మనసులో నిలిచిపోయేలాగా ఉంటాయి. ఎన్ని సంవత్సరాలు అయినా వాళ్ల పాటలు వింటూనే ఉంటారు. వాళ్లకి సంవత్సరాలు పెరిగే కొద్దీ అభిమానులు పెరుగుతూనే ఉంటారు. చిన్నపిల్లల నుండి వృద్ధుల వరకు అందరూ వారికి అభిమానులుగా ఉంటారు. అంటే వారు అంత బాగా పాడుతారు.

Video Advertisement

this child is a great singer

వారి గాత్రంతో అంత మంది అభిమానులను సంపాదించుకున్నారు. భాషకి పరిమితం అవ్వకుండా అన్ని భాషల్లో వారు పాడుతూ ఉంటారు. అలా భారతదేశ వ్యాప్తంగా గుర్తింపు సంపాదించుకున్నారు. ఈ పైన ఫోటోలో ఉన్న చిన్నపిల్ల కూడా ఇప్పుడు భారతదేశ వ్యాప్తంగా గర్వపడే సింగర్ అయ్యారు. శ్రేయ ఘోషల్ తెలియని వారు ఉండరు. ఎన్నో వేల పాటలు పాడారు. ఎన్నో వందల అవార్డులు గెలుచుకున్నారు. ఎన్నో కోట్ల మంది అభిమానులను సంపాదించుకున్నారు. బాలీవుడ్ సినిమా వస్తోంది అంటే అందులో శ్రేయ ఘోషల్ పాట ఉండాల్సిందే.

ఇప్పుడు టాలీవుడ్ లో కూడా ఏదైనా ఒక మంచి పాట పాడాలి అనుకుంటే అందుకోసం శ్రేయ ఘోషల్ ని తీసుకుంటారు. శ్రేయ ఘోషల్ గాత్రం వల్ల ఆ పాటలకు ఇంకా అందం వస్తుంది. శ్రేయ ఘోషల్ పాటలకు ఎంత అభిమానులు ఉన్నారో చెప్పడానికి ఇప్పుడు విడుదలైన పుష్ప సినిమాలోని పాట ఉదాహరణ. పుష్ప 2 సినిమాలోని కపుల్ సాంగ్ తెలుగుతో పాటు, తమిళ్, కన్నడ, మలయాళం, హిందీ, ఇవన్నీ మాత్రమే కాకుండా బెంగాలీలో కూడా శ్రేయ ఘోషల్ పాడారు. శ్రేయ ఘోషల్ మాతృభాష బెంగాలీ. అలాంటప్పుడు బెంగాలీలో శ్రేయ ఘోషల్ పాట లేకుండా ఎలా ఉంటుంది.

పైన ఉన్న ఫోటో శ్రేయ ఘోషల్ చిన్న వయసులో ఉన్నప్పుడు ఒక రియాలిటీ షోలో పాల్గొన్నప్పటిది. దేవదాస్ సినిమాతో శ్రేయ ఘోషల్ సినిమా ఇండస్ట్రీలో అడుగు పెట్టారు. అప్పటి నుండి వెనక్కి తిరిగి చూసుకో లేదు. ఎన్ని కోట్ల మంది అభిమానులను సంపాదించుకొని మెలోడీ క్వీన్ గా గుర్తింపు తెచ్చుకున్నారు శ్రేయ ఘోషల్. యంగ్ యాక్టర్ నుండి సీనియర్ యాక్టర్ సినిమాల్లో ఏ హీరోయిన్ కి అయినా సూట్ అయ్యేలాగా శ్రేయ ఘోషల్ పాడతారు. అందుకే ఇంత మంది శ్రేయ ఘోషల్ కి అభిమానులు అయ్యారు.


End of Article

You may also like