“జైలర్” చూశాక హీరోలతో పాటు దీనికి కూడా క్రేజ్ వచ్చింది..! అది ఏంటంటే..?

“జైలర్” చూశాక హీరోలతో పాటు దీనికి కూడా క్రేజ్ వచ్చింది..! అది ఏంటంటే..?

by kavitha

Ads

సూపర్ స్టార్ రజినికాంత్ ప్రధాన పాత్రలో నటించిన జైలర్ మూవీ గత వారం రిలీజ్ అయ్యి, బాక్సాఫీస్ దగ్గర కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. ఈ చిత్రానికి బీస్ట్ దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమర్ దర్శకత్వం వహించారు. మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ సంగీతాన్ని అందించాడు.

Video Advertisement

క్యామియో రోల్స్ లో మలయాళ స్టార్ మోహన్ లాల్, కన్నడ సూపర్ స్టార్ శివరాజ్ కుమార్, బాలీవుడ్ నటుడు జాకీష్రాఫ్ నటించారు. అయితే ఈ మూవీలో వ రాజ్ కుమార్ పాత్ర చాలా హైలెట్ గా నిలిచింది. ఎంతలా అంటే ఈ మూవీలో ఆయన వాడిన వస్తువుకు కూడా క్రేజ్ వచ్చింది. ఆ వస్తువు ఏమిటో ఇప్పుడు చూద్దాం..  జైలర్ మూవీలో రజినీకాంత్ లీడ్ రోల్ లో నటించగా ఆయన భార్యగా ఈ మూవీలో రమ్యకృష్ణ నటించింది. తమన్నా, వసంత్ రవి, వినాయకన్ కీలక పాత్రలలో నటించారు. ఈ చిత్రం మూడు రోజుల్లో 200 కోట్ల వసూలు చేసినట్టు తెలుస్తోంది. సూపర్ స్టార్ రజినీకాంత్ చాలా కాలం తర్వాత బాక్సాఫీస్ దగ్గర సాలిడ్ హిట్ అందుకున్నాడు. గత 10 ఏళ్ల కాలంలో రజనీకాంత్  సినిమాలు ఆశించిన సక్సెస్ అందుకోలేదు. జైలర్ మూవీతో అన్ని చోట్ల మంచి వసూళ్లను సాధిస్తోందని చెప్పవచ్చు.
జైలర్ మూవీ విజయంలో క్యామియో రోల్స్ కీలక పాత్ర పోషించాయనే విషయం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. వీరిలో ముఖ్యంగా శివ రాజ్ కుమార్ పాత్ర హైలెట్ గా నిలిచింది. నరసింహా అనే పవర్ ఫుల్ క్యారెక్టర్ లో కనిపించి, థియేటర్లను షేక్ చేశారు. చాలామందికి, ఇతర రాష్ట్రాలవారికి ఆయన అంతగా తెలియకపోవచ్చు. శివ రాజ్ కుమార్ శాండల్ వుడ్ లో పెద్ద స్టార్. ఈ మూవీ తరువాత ఆయన గురించి ఆన్ లైన్ లో వెతుకుతున్నారు.
ఆయన మూవీలో కనిపించింది కొన్ని నిముషాలు అయినా, ఆయన పంచెకట్టుతో కనిపించి, ఇంపాక్ట్ క్రియేట్ చేశారు. ఆయన రోల్ కు ప్రేక్షకుల్లో ఎంత క్రేజ్ వచ్చిందంటే, మూవీలో ఆయన వాడిన ఒక టిష్యూ కూడా పాపులర్ అయ్యింది. ఈ మూవీలో శివ రాజ్ కుమార్ ఓరిగామి అనే టిష్యూను ఉపయోగించారు. ఆ సీన్ తర్వాత ఈ టిష్యూలు కూడా విపరీతంగా ఫేమస్ అయిపోయాయి అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

Also Read: సినిమాల్లోకి వచ్చిన కొత్తల్లో “రాజశేఖర్ – జీవిత” మధ్య జరిగిన ఈ సంఘటన తెలుసా..? కానీ ట్విస్ట్ ఏంటంటే..?


End of Article

You may also like