ఒక వ్యక్తి తన కుటుంబంతో విడిపోయి ఒక 25 సంవత్సరాల తర్వాత వారిని కలిస్తే ఎలా ఉంటుందో తెలుసా? ఇదేదో సినిమా కథ లాగా ఉంది కదా? ఇది నిజంగా జరిగిన ఒక సంఘటన. కానీ ఈ కథనే సినిమాగా తీశారు. వివరాల్లోకి వెళితే. ఈ కథ ఖాండ్వా లో మొదలవుతుంది. సరో అనే ఒక అబ్బాయికి తల్లి, చెల్లెలు, అన్న ఉంటారు. అన్న పేరు గుడ్డు. గుడ్డు రైల్వే స్టేషన్ దగ్గర పనిచేస్తూ ఉంటాడు.

Lion movie real story

గుడ్డుతో పాటు సరో కూడా వెళుతూ ఉంటాడు. ఒకరోజు గుడ్డు అలాగే తన పనికి వెళ్ళిపోతూ ఉంటే సరో కూడా తనతో పాటు వస్తాను అని వెళ్తాడు. సరో కి నిద్ర వస్తోంది అని గుడ్డు సరో ని ఒక బెంచ్ మీద పడుకోమని చెప్తాడు. గుడ్డు సరోకి ఎక్కడికి వెళ్లొద్దు అని, పని ముగించుకుని వస్తాను అని చెప్తాడు.

Lion movie real story

కానీ పొద్దున్నే లేచి చూసేటప్పటికీ సరో ఒక ట్రైన్ లో ఉంటాడు. సరో కి ఏమీ అర్థం కాదు. గుడ్డు ట్రైన్ లో ఉన్నాడు ఏమో అని పిలుస్తాడు. కానీ తన అన్న ట్రైన్ లో లేడు అన్న విషయం సరో కి అర్థం అవుతుంది. తర్వాత సరో ని ఒక వ్యక్తి పోలీసులకు అప్పగిస్తే ఆ పోలీసులు సరో ని అనాధాశ్రమంలో చేర్పిస్తారు.

Lion movie real story

ఆ తర్వాత సరో ని ఒక ఆస్ట్రేలియన్ దంపతులు వచ్చి దత్తత తీసుకొని వేరే దేశానికి తీసుకెళ్ళిపోతారు. అయితే, ఇంత జరుగుతున్నా కూడా ఇన్ని సంవత్సరాలు గడిచినా కూడా సరో ని వెతికేందుకు గుడ్డు ప్రయత్నం చేయలేదా అని ఒక అనుమానం రావచ్చు. కానీ సరో తప్పిపోయిన రోజు ట్రైన్ కింద పడి గుడ్డు మరణిస్తాడు.

Lion movie real story

25 సంవత్సరాల తర్వాత సరో మళ్లీ ఎన్నో ప్రయత్నాలు చేసి, ఎంతో కష్టపడి భారతదేశానికి వచ్చి తన తల్లిని కలుసుకుంటాడు. ఇది నిజంగా జరిగిన ఒక సంఘటన. ఈ సినిమాని లయన్ పేరుతో రూపొందించారు. ఇందులో స్లమ్ డాగ్ మిలియనీర్ సినిమాలో నటించిన దేవ్ పటేల్ హీరోగా నటించారు.