ముగ్గురు సూపర్‌స్టార్లు ఆ బంగ్లాలోకి వెళ్ళాక అంతా కోల్పోయి, దివాళా తీశారు..! వారు ఎవరంటే..?

ముగ్గురు సూపర్‌స్టార్లు ఆ బంగ్లాలోకి వెళ్ళాక అంతా కోల్పోయి, దివాళా తీశారు..! వారు ఎవరంటే..?

by kavitha

Ads

కొన్ని ఇళ్ళు చూడడానికి చాలా అందంగా, ఖరిదైనవిగా ఉంటాయి. అయితే అందులోకి వెళ్ళిన వారు సర్వం కోల్పోయి, దానిని అమ్ముకోవాల్సిన పరిస్థితులు ఎదురవుతుంటాయి. వాటిని హాంటెడ్ లేదా శాపగ్రస్త’ బంగ్లా అని పిలుస్తుంటారు. ఇలాంటివి ఎక్కువగా సినిమాలలో కనిపిస్తుంటాయి. అయితే వాస్తు జ్యోతిష్యం వంటి వాటిని నమ్మేవారు, ఇలాంటి వాటిని నమ్ముతూ ఉంటారు.

Video Advertisement

కానీ కొందరు ఇలాంటివాటిని  మూఢనమ్మకాలుగా చూస్తుంటారు. అయితే ఇలాంటి బంగ్లానే ముంబైలో ఉంది. ముంబైలో కార్టర్ రోడ్ లో ఉన్న’ఆశీర్వాద్’ బంగ్లా బాలీవుడ్‌కు శాపంగా మారింది. ఇందులో  జీవించిన ముగ్గురు సూపర్ స్టార్లు కెరీర్‌ను కోల్పోయి, చివరికి ఈ ఇంటిని అమ్మేశారు. వారెవరో ఇప్పుడు చూద్దాం..

1. భరత్ భూషణ్:

‘ఆశీర్వాద్‌’ బంగ్లాను 1950ల ప్రారంభంలో ఆంగ్లో-ఇండియన్ ఫ్యామిలీ నుండి కొనుగోలు చేశారు. అప్పటికే అతను ఎన్నో హిట్ సినిమాలలో హీరోగా నటించి, బాక్సాఫీస్ కింగ్ పేరు తెచ్చుకున్నారు. ఈ ఇంటిని సొంతం చేసుకున్న భరత్ భూషణ్ 50ల మొదట్లో బైజు బావ్రా, గేట్‌వే ఆఫ్ ఇండియా, మీర్జా గాలిబ్ మరియు బర్సాత్ కీ రాత్ లాంటి హిట్‌లను సాధించాడు. కానీ దశాబ్దం ముగిసే నాటికి వరుసగా సినిమాలు ఫ్లాప్ కావడంతో చాలా అప్పుల పాలయ్యాడు. దాంతో ఆ బంగ్లాను అమ్ముకోవాల్సి వచ్చింది. దాంతో  ఆ బంగ్లాలో నివసించే వారికి దురదృష్టాన్ని తెస్తుందని పలు కథనాలు వెలువడటం ప్రారంభించాయి.

2. రాజేంద్ర కుమార్:

రైజింగ్ స్టార్ అయిన రాజేంద్ర కుమార్ 1960లలో, ఈ బంగ్లా గురించి తెలుసుకున్నారు. దానిపై వస్తున్న కథనాల వల్ల 60,000 రూపాయల తక్కువ మొత్తానికి కొనుగోలు చేశారు. రాజేంద్ర కుమార్ ఆ బంగ్లాకు తన కుమార్తె డింపుల్ పేరు పెట్టాడు. ఫ్రెండ్ మనోజ్ కుమార్ సలహా మేరకు, శాపం నుండి బయటపడటానికి అందులో పూజ చేసాడు. ఆ తరువాత అతనికి హిట్ల మీద హిట్లు వచ్చి జూబ్లీ కుమార్‌గా పాపులర్ అయ్యారు.  ఈ ఇల్లు తనకి అదృష్టమని అనుకున్నారు. కానీ 1968-69లో, అతని సినిమాలు వరుసగా ఫ్లాప్ అయ్యి,  ఆర్థిక సమస్యల్లో చిక్కుకుని తనకు ఇష్టమైన ఇంటిని విక్రయించవలసి వచ్చింది.

3. రాజేష్ ఖన్నా:

70వ దశకంలో, అప్పటికి అప్ కమింగ్ హీరోగా ఉన్న రాజేష్ ఖన్నా కొనుగోలు చేశారు. ఆ తరువాత అతి తక్కువ సమయంలోనే  రాజేష్ ఖన్నాను సూపర్ స్టార్ గా అవతరించాడు. బాలీవుడ్ లో అతిపెద్ద నటుడుగా నిలిచాడు. ఆ బంగ్లాకు ఆశీర్వాద్ గా నామకరణం చేశాడు. అమితాబ్ జల్సా, షారూఖ్ మన్నత్ లానే, అప్పట్లో రాజేష్ ఖన్నా ఆశీర్వాద్‌ ముంబైలో ప్రత్యేక ఆకర్షణగా మారింది.

కానీ 70వ దశకం చివరి నాటికి, సూపర్ స్టార్ పేరుని కోల్పోయాడు. ఆయన రెప్యుటేషన్‌ కూడా తగ్గిపోయింది. భార్య విడిపోయింది. ఆయన అదే బంగ్లాలో ఒంటరిగా, మరణించే వరకు బంగ్లాలోనే ఉన్నారు.  ఆ బంగ్లాను రూ.90 కోట్లకు ఓ పారిశ్రామికవేత్తకు విక్రయించారు. ఫిబ్రవరి 2016లో కొత్తదాన్ని నిర్మించడానికి ఆ బంగ్లాను పడగొట్టారు. అలా ముగ్గురు సూపర్ స్టార్లకు  నిలయమైన ఆ బంగ్లా జర్నీ ముగిసింది.

Also Read: “శాకుంతలం”లో ఈ సీన్ గమనించారా..? చూసుకోవాలి కదా ఎడిటర్ గారూ..?


End of Article

You may also like