“శాకుంతలం”లో ఈ సీన్ గమనించారా..? చూసుకోవాలి కదా ఎడిటర్ గారూ..?

“శాకుంతలం”లో ఈ సీన్ గమనించారా..? చూసుకోవాలి కదా ఎడిటర్ గారూ..?

by kavitha

Ads

సమంత ప్రధాన పాత్రలో డైరెక్టర్ గుణశేఖర్ తెరకెక్కించిన పీరియాడికల్ చిత్రం ‘శాకుంతలం’. మహాభారతంలోని శకుంతల, దుష్యంతుల ప్రేమకథ ఆధారంగా రూపొందిన ఈ చిత్రం థియేటర్లలో ఏప్రిల్ 14న రిలీజ్ అయ్యింది. పాన్ ఇండియా మూవీగా విడుదల అయిన ఈ చిత్రం మొదటి షో నుండే ఫ్లాప్ టాక్ ను తెచ్చుకుంది.

Video Advertisement

అంతగా వసూళ్లను రాబట్టలేకపోయింది. అయితే ఈ చిత్రంలో భరతుడు పాత్రలో నటించిన అల్లు అర్జున్ కుమార్తె అల్లు అర్హ నటించింది. తాజాగా సోషల్ మీడియా అల్లు అర్హ నటించిన ఓ సీన్ చక్కర్లు కొడుతోంది. ఇది చూసినవారు కామెంట్స్ చేస్తున్నారు. అదేమిటో ఇప్పుడు చూద్దాం..
శాకుంతలం చిత్రంలో సమంత శకుంతలగా, దేవ్ మోహన్ దుష్యంతుడుగా నటించారు. కలెక్షన్ కింగ్ మోహన్ బాబు కీలకపాత్రలో నటించాడు. శకుంతల దుష్యంతుల కుమారుడు భరతుడిగా స్టార్ హిరో అల్లు అర్జున్ గారాల పట్టి అల్లు అర్హ నటించింది. ఈ చిత్రం భారీ అంచనాల మధ్య రిలీజ్ అయ్యింది. కానీ వాటిని అందుకోలేక బాక్సాఫీస్ దగ్గర డిజాస్టర్ గా నిలిచింది. ఫస్ట్ షోతోనే ప్లాప్ టాక్ తెచ్చుకుంది. సమంత, దర్శకుడు గుణశేఖర్ విమర్శల పాలయ్యారు. సోషల్ మీడియాలో డైరెక్టర్ ను తీవ్రంగా ట్రోల్ చేశారు. సమంత ఆ పాత్రకు సెట్ అవలేదని విమర్శించారు.ఈ చిత్రం ఓటిటిలో రిలీజ్ కాగా, అక్కడ కూడా డిజాస్టర్ గానే నిలిచింది. ఓటీటీ రిలీజ్ లోనూ ట్రోలింగ్ తప్పలేదు. అయితే ఈ చిత్రం ప్లాప్ అయిన భరతుడిగా అల్లు అర్హ నటనను, డైలాగ్స్ ను మాత్రం అందరు మెచ్చుకున్నారు. అల్లు అర్హకు బాలనటిగా ఇదే మొదటి చిత్రం. అయినప్పటికి ఎలాంటి భయం లేకుండా అద్భుతంగా నటించడంతో పాటుగా, తన పాత్రకి తానే డబ్బింగ్ చెప్పుకుంది. అర్హ నటించిన సన్నివేశాలు సినిమాకి హైలెట్ గా నిలిచాయి.
అయితే తాజాగా సోషల్ మీడియాలో ఈ సినిమాలోని ఒక వీడియో షికారు చేస్తోంది. దేవ్ మోహన్ అల్లుఅర్హను ఎత్తుకుని మాట్లాడుతున్న సన్నివేశంలో అల్లుఅర్హ వస్తున్న నవ్వును ఆపుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంది. దానిని చూసిన నెటిజెన్లు కొంచెం చూసుకోవాలి కదా ఎడిటర్ గారూ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.Also Read: తెలుగు నిర్మాతలకు షాక్.. ఓటీటీ రిలీజ్ కి సిద్ధమైన “2018 ” మూవీ..!! ఎప్పటినుంచి అంటే..??


End of Article

You may also like