తెలుగు నిర్మాతలకు షాక్.. ఓటీటీ రిలీజ్ కి సిద్ధమైన “2018 ” మూవీ..!! ఎప్పటినుంచి అంటే..??

తెలుగు నిర్మాతలకు షాక్.. ఓటీటీ రిలీజ్ కి సిద్ధమైన “2018 ” మూవీ..!! ఎప్పటినుంచి అంటే..??

by Anudeep

Ads

సూపర్ టాక్ తో బాక్సాఫీస్ ను షేక్ చేస్తున్న మలయాళ మూవీ 2018. కేరళలో సంభవించిన వరదల నేపథ్యంలో తెరకెక్కిన ఈసినిమా మళయాలంలో ఇప్పటివరకు 100 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టి ఆల్ టైం ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. రీసెంట్ గా మిగతా భాషల్లో కూడా విడుదలై సూపర్ రెస్పాన్స్ ను తెచ్చుకుంటుంది. ఆల్రెడీ తెలుగులో 5 రోజుల్లో 5 కోట్లకు పైగా రాబట్టి హిట్ అనిపించుకుంది.

Video Advertisement

 

 

అయితే ఈ సినిమా ఓటీటీ విషయంలో అప్ డేట్ వచ్చింది. ఈ సినిమా ఓటీటీ హక్కులను కొన్న సోనీ లివ్.. ఈ సినిమాను డిజిటల్ ప్రీమియర్‌గా అందుబాటులోకి అతి త్వరలో తీసుకువస్తుంది. దీనికి సంబంధించిన సోనీలివ్ ఓ ప్రకటన కూడా చేసింది. ఈ సినిమాను సోనిలీవ్ జూన్ 07న తీసుకువస్తున్నట్లు ప్రకటించింది.

2018 movie OTT release date fixed..!!

మలయాళంలో ఈసినిమా విడుదలై ఈ రోజుకి 26 రోజులు అవుతుంది. ముందుగా కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం మరో ఎనిమిది రోజుల్లో ఓటిటి లోకి రావాల్సివుంది. అన్ని భాషలకు గాను ఈసినిమా డిజిటల్ రైట్స్ ను సోనీ లివ్ సొంతం చేసుకుంది.దాంతో సోనీ లివ్ జూన్ 7న ఈసినిమాను స్ట్రీమింగ్ లోకి తీసుకురావడానికి సిద్దమవుతుంది.

2018 movie OTT release date fixed..!!

గురువారం జ‌రిగిన 2018 స‌క్సెస్‌మీట్‌లో ఈ సినిమా తెలుగు ఓటీటీ రిలీజ్ డేట్‌పై అల్లు అర‌వింద్‌తో పాటు బ‌న్సీవాస్ అసంతృప్తిని వ్య‌క్తం చేశారు. మినిమం రెండు వారాల గ్యాప్ ఉంటే బాగుండేద‌ని పేర్కొన్నారు. అయితే థియేట‌ర్ల‌లో విడుద‌లైన ప‌ది రోజుల్లోనే 2018 తెలుగు వెర్ష‌న్ ఓటీటీలో రిలీజ్ కానుంది. ఇప్పటికీ ప్ర‌తిరోజు కోటికిపైగా క‌లెక్ష‌న్స్ రాబ‌డుతూ ట్రేడ్ వ‌ర్గాలను విస్మ‌య‌ప‌రుస్తోంది ఈ చిత్రం.

2018 movie OTT release date fixed..!!

2018 మూవీలో టోవినో థామ‌స్‌, వినీత్ శ్రీనివాస‌న్‌, కుంచ‌కో బోబ‌న్‌, లాల్‌, అప‌ర్ణ బాల‌ముర‌ళి కీల‌క పాత్ర‌ల‌ను పోషించారు. గ‌త నెల‌లో మ‌ల‌యాళంలో రిలీజైన మూవీ 160 కోట్ల‌కుపైగా క‌లెక్ష‌న్స్ రాబ‌ట్టింది. మ‌ల‌యాళ సినీ చ‌రిత్ర‌లో అత్య‌ధిక క‌లెక్ష‌న్స్ క‌లెక్ష‌న్స్ రాబ‌ట్టిన సినిమాగా నిలిచింది. 2018లో వ‌చ్చిన కేర‌ళ వ‌ర‌ద‌ల నేప‌థ్యంలో స‌ర్వైవ‌ల్ థ్రిల్ల‌ర్‌గా ద‌ర్శ‌కుడు జూడ్ ఆంథోనీ జోసెఫ్ ఈ సినిమాను తెర‌కెక్కించారు.

Also read: “విరూపాక్ష” సినిమాలో అసలు పాయింట్ మర్చిపోయారుగా..? అది ఏంటంటే..?


End of Article

You may also like