నాగ చైతన్య ఒక మంచి యాక్టర్. ఇప్పటికే తన నటనతో తన ఇంట్లో చాలాసార్లు ప్రూవ్ చేసుకున్నాడు. నాగ చైతన్య గురించి కొత్తగా తెలుగు ప్రేక్షకులకి పరిచయం చెయ్యక్కర్లేదు. అక్కినేని వారసుడిగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన నాగ చైతన్య కెరీర్ లో నిలదొక్కుకోవడానికి చాలా కష్టమే పడాల్సొచ్చింది.

Video Advertisement

బ్యాక్ గ్రౌండ్ ఉన్నప్పటికీ ప్రేక్షకులు నాగ చైతన్యను యాక్సెప్ట్ చేయడానికి టైం తీసుకున్నారు. జోష్ సినిమాతో ఎంట్రీ ఇచ్చిన నాగ చైతన్య.. ఆ సినిమా అంతగా ఆడకపోవడంతో మళ్ళీ ప్రయత్నాలు చేసారు.

ఆయన సినిమాల్లో ఫ్లాప్స్ ఎక్కువ ఉన్నప్పటికీ.. కధలు ఎంచుకునే విధానంలో ఆయన ప్రత్యేకత కనబరిచారు. కొన్ని కొత్త కధలను ఎంచుకోవడం వలన కూడా ఆయనకు ఫ్యాన్స్ లో క్రేజ్ ఏర్పడింది. ఏ మాయ చేసావే సినిమా మంచి హిట్ టాక్ తీసుకు వచ్చింది. అలానే ఏ మాయ చేసావే సినిమా నాగ చైతన్యకు లవర్ బాయ్ ఇమేజ్ ను కూడా తీసుకొచ్చింది.

ఇదిలా ఉంటే ఇప్పుడు కోలీవుడ్ డైరెక్ట‌ర్ వెంక‌ట్ ప్ర‌భు తో నాగ చైతన్య ఓ సినిమా చేస్తున్నారు. దీనితో పోలీస్ ఆఫీసర్ పాత్ర చేస్తున్నారు నాగ చైతన్య. షూటింగ్ కూడా ప్రస్తుతం జరుగుతోంది. ఈ సినిమా పై ఎక్స్పెక్టేషన్స్ కూడా ప్రేక్షకులకి ఎక్కువగానే వున్నాయి. తెలుగు, త‌మిళ భాష‌ల్లో దీన్ని తీసుకు వస్తున్నారు. కృతి శెట్టి చైతు సరసన నటించనున్నారు. న‌టి ప్రియ‌మ‌ణి కూడా ఈ చిత్రంలో ఓ రోల్ చేస్తున్నట్టు తెలుస్తోంది. యువ‌న్ శంక‌ర్ రాజా ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. అయితే నాగ చైతన్య పుట్టిన రోజు సందర్భంగా సినిమా టైటిల్ ని, ఫస్ట్ లుక్ ని రేపు విడుదల చేస్తారట.