Ads
ఒకప్పుడు సౌత్ ఇండస్ట్రీలో చాలా మంది నటీమణులు చీరని కట్టుకోడాన్నే ఇష్టపడతారు. ఏ ఫంక్షన్ కి వెళ్ళినా, ఏ సినిమా షూటింగ్ అయినా షాపింగ్ మాల్స్ ఓపెనింగ్ అయినా చీరలనే ప్రిఫర్ చేసేవారు. ఎందుకంటే చీరలు కట్టుకుంటే వాళ్ళు చాలా లక్షణంగా కనిపించేవారు. అలా ట్రెండ్ మారుతూ మారుతూ ఇప్పుడు హీరోయిన్లు చీరలు కట్టడమే మానేశారు. ఇప్పుడు ట్రెండ్ కి తగ్గట్టు పొట్టి పొట్టి డ్రస్సులతో అట్రాక్టివ్ గా కనిపిస్తున్నారు.
Video Advertisement
ఒక హీరోయిన్ చీర కట్టాలంటే సినిమాలో ఏదో పెళ్లి సన్నివేశము లేకపోతే ఏదో ఫంక్షన్స్ సీన్ ఉంటే కానీ చీర కట్టడం చాలా అరుదైపోయింది. ఇలాంటి జనరేషన్లో కూడా ఈ స్టార్ హీరోయిన్ కు చీర కట్టుకోవడం అంటే చాలా ఇష్టం. అందులోని ఈ భామకి మోడరన్ డ్రెస్సులు అసలు నచ్చవట, చీర కట్టుకోవడంలో ఉండే కంఫర్ట్ మరే డ్రెస్ లోని రాదు అని చెప్పింది. ఇంతకీ ఎవరో తెలుసా? ఈమె మరెవరో కాదు నటి సాయి పల్లవి.
సాయి పల్లవి అంటేనే సింపుల్సిటీకి మారుపేరు. ప్రేమమ్ సినిమాతో ఇండస్ట్రీకి పరిచయమైంది. ఆ సినిమాలోనే చీర కట్టుకొని అందరినీ అలరించింది సాయి పల్లవి. తెలుగులో వచ్చిన ఫిదా సినిమాతో లంగా వోణీలు, చీరలలో చూడముచ్చటగా కనిపించిన సాయి పల్లవి ఒక ఇంటర్వ్యూలో తనకి చీరలు కట్టుకోవడం చాలా సులువు గా వచ్చని, కేవలం మూడు నిమిషాలలోనే చీర కట్టుకోగలనని అది అంత కష్టమైన పనేం కాదు అని తెలిపింది.
సాయి పల్లవి చీరలో ఎంత ముద్దుగా ఉంటుందో చెప్పాల్సిన అవసరం లేదు. తాజాగా జరిగిన తన చెల్లెలి నిశ్చితార్థం లో చీర కట్టుకొని స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచింది సాయి పల్లవి. ఈమె సింప్లిసిటీకే నార్త్ లో సినిమా చేయకపోయినా చాలామంది ఫ్యాన్స్ ని సంపాదించుకుంది. ఈ జనరేషన్ లో కూడా ఇలాంటి భామలు ఉండడం గ్రేట్ అంటూ అభిమానులు సాయి పల్లవిని తెగ పొగుడుతున్నారు.
End of Article