తమిళ్ లో విజయ్ తో… తెలుగులో రామ్ చరణ్ తో మొదటి సినిమాలు చేసింది… అసలైన గ్లోబల్ స్టార్ ఈ హీరోయిన్..! ఎవరో కనిపెట్టగలరా..?

తమిళ్ లో విజయ్ తో… తెలుగులో రామ్ చరణ్ తో మొదటి సినిమాలు చేసింది… అసలైన గ్లోబల్ స్టార్ ఈ హీరోయిన్..! ఎవరో కనిపెట్టగలరా..?

by Harika

Ads

సాధారణంగా హీరోయిన్స్ గురించి చాలా మందికి ఒక ఆలోచన ఉంటుంది. హీరోయిన్స్ ఒక వయసు వరకు మాత్రమే హీరోయిన్ పాత్రలు వేస్తారు అని అంటారు. కానీ చాలా మంది హీరోయిన్స్ అది నిజం కాదు అని నిరూపించారు. 40 కి దగ్గరగా ఉన్నా కూడా ఇప్పటికీ కూడా హీరోయిన్ పాత్రలు వేస్తూ వస్తున్నారు. అందుకు వాళ్ల టాలెంట్ మాత్రమే కారణం. ప్రతి సినిమాని ఒక అవకాశంగా తీసుకొని తమ టాలెంట్ నిరూపించుకుంటూ వస్తున్నారు. అలా ఒక హీరోయిన్ ఎంతో కష్టపడి గ్లోబల్ స్టార్ స్థాయికి ఎదిగారు. దాదాపు పది సంవత్సరాల క్రితం ఈ హీరోయిన్ గ్లోబల్ స్టార్ అని అన్నారు. ఇప్పుడు అదే పేరుని నిలుపుకుంటూ వస్తున్నారు.

Video Advertisement

this heroine is global star

చిన్న వయసులోనే సినిమా ఇండస్ట్రీలో అడుగు పెట్టారు. ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొన్నారు. ఇప్పుడు ఎంతో పెద్ద స్థాయికి ఎదిగారు. ఈ పైన ఉన్న ఫోటో ఆ హీరోయిన్ ది. చాలా సంవత్సరాలు ఇండస్ట్రీలో ఎంతో కష్టపడ్డారు. గొప్ప నటుల్లో ఒకరిగా గుర్తింపు సంపాదించుకున్నారు. నేషనల్ అవార్డు కూడా గెలుచుకున్నారు. ప్రియాంక చోప్రా. ఈ పేరు తెలియని వాళ్ళు ఉండరు. ప్రియాంక చోప్రా తమిళ్ లో మొదటి సినిమా విజయ్ తో నటించారు. ఇదే సినిమాలో ప్రియాంక చోప్రా ఒక పాట కూడా పాడారు. తర్వాత బాలీవుడ్ నుండి వరుస అవకాశాలు రావడంతో అక్కడ సినిమాలతో బిజీ అయిపోయారు. ఆ తర్వాత తెలుగులో కూడా రామ్ చరణ్ హీరోగా నటించిన తుఫాన్ సినిమాలో నటించారు.

ఈ సినిమా ప్రియాంక చోప్రా మొదటి తెలుగు సినిమా. ఆ తర్వాత ప్రియాంక చోప్రా కొన్ని తెలుగు సినిమాలు చేస్తారు అంటూ వార్తలు వచ్చాయి కానీ తెలుగు సినిమాలకు దూరంగానే ఉన్నారు. ప్రియాంక చోప్రా మంచి నటి మాత్రమే కాదు. మంచి వ్యాపారవేత్త కూడా. ఎన్నో వ్యాపారాల్లో ప్రియాంక చోప్రా రాణిస్తున్నారు. ఇప్పుడు ప్రియాంక చోప్రా ఎక్కువ హాలీవుడ్ సినిమాలు మాత్రమే చేస్తున్నారు. అక్కడ సినిమాలు, సిరీస్ చేస్తూ అక్కడ గుర్తింపు సంపాదించుకుంటున్నారు. భారతదేశానికి గర్వకారణంగా నిలిచారు.


End of Article

You may also like