సినిమాల్లో ఒక వెలుగు వెలిగిన ఈ హీరోయిన్… నిజజీవితంలో ఇంత క్షోభ అనుభవించిందా..? ఏం చెప్పింది అంటే..?

సినిమాల్లో ఒక వెలుగు వెలిగిన ఈ హీరోయిన్… నిజజీవితంలో ఇంత క్షోభ అనుభవించిందా..? ఏం చెప్పింది అంటే..?

by Anudeep

Ads

ఆషా షైనీ.. ఈ పేరు అందరికి తెలుసు.. నరసింహ నాయుడు చిత్రం లో ‘లక్స్ పాపా’ సాంగ్ తో ఫేమస్ అయినా ఈమె పలు తెలుగు చిత్రాల్లో నటించి మెప్పించింది. తర్వాత తన పేరును ఫ్లోరా షైనీ గా మార్చుకుంది. సినిమాలతో పాటు..పలు వెబ్ సిరీస్ లలో కూడా ఈమె నటించింది. తాజాగా ఒక ఇంటర్వ్యూ లో మాట్లాడుతూ తన మాజీ బాయ్ ఫ్రెండ్ గురించి చెప్పుకొచ్చింది ఫ్లోరా. తన బాయ్ ఫ్రెండ్ గౌరవ్ తనని ఏ విధంగా గృహ హింసకు గురిచేసాడో ఆమె వెల్లడించింది.

Video Advertisement

 

“అతడి కోసం నా కన్న వాళ్ళని కూడా వదిలేసి వచ్చాను. ప్రేమించినపుడు బాగానే ఉండే అతడు.. తర్వాత పిచ్చి పట్టినట్టు ప్రవర్తించేవాడు.. నన్ను కొట్టడం మొదలు పెట్టాడు. ఎందుకు కొట్టే వాడో కూడా తెలీదు. ఒకరోజు అతడు కొట్టడం తో నా దవడ పగిలిపోయింది. అంతే కాకుండా నన్ను చంపేస్తాను అంటూ వెంట పడ్డాడు. దాంతో పారిపోయాను. తర్వాత మా ఇంటికి వెళ్లి.. నా తల్లి తో కలిసి పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చాను. ఆ రోజు తప్పించుకోకుండా ఉండి ఉంటే.. నా పరిస్థితి కూడా శ్రద్ధా వాకర్ లా అయ్యుండేది. ” అని ఫ్లోరా తెలిపింది.

this heroine story

 

2018 లో మొదలైన మీ టూ ఉద్యమ సమయం లో తనకు ఎదురైన గృహ హింస గురించి చెప్పుకొచ్చిన ఆమె.. తాజాగా మరొక ఇంటర్వ్యూలో ఆ విషయాలను తెలిపింది. సామాన్య మహిళలే కాకుండా.. పలువురు సెలెబ్రెటీలు కూడా గృహ హింసకు గురైనట్లు గతం లో పలువురు వెల్లడించారు.

this heroine story

టాలీవుడ్ లో పలు సినిమాల్లో నటించింది ఫ్లోరా. ‘నరసింహ నాయుడు’, ‘నువ్వు నాకు నచ్చావ్’ వంటి బ్లాక్ బస్టర్ సినిమాల్లో స్టార్ హీరోల సరసన నటించింది. హిందీ లో ‘లవ్ ఇన్ నేపాల్’, ‘దబాంగ్ 2 ‘, ‘దానక్’, ‘స్త్రీ’ సినిమాల్లో నటించింది. ప్రస్తుతం ఆమె గృహ హింసకు వ్యతిరేకం గా ప్రజల్ని చైతన్య పరుస్తోంది.

ALSO READ : “జూనియర్ ఎన్టీఆర్” నుండి “సాయి పల్లవి” వరకు… సినిమాల్లో “చనిపోయే పాత్రలు” చేసిన 10 యాక్టర్స్..!


End of Article

You may also like