Ads
సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న క్రేజీ మూవీ ‘గుంటూరు కారం’. మహేష్, త్రివిక్రమ్ కాంబోలో ఇతకు ముందు అతడు, ఖలేజా చిత్రాలు వచ్చాయి. గుంటూరు కారం మూవీ కోసం మూడోసారి వీరిద్దరూ చేతులు కలిపారు.
Video Advertisement
మహేష్ 28వ చిత్రంగా తెరకెక్కుతున్న ఈ మూవీని హారిక అండ్ హాసిని క్రియేషన్స్ పతాకం పై ఎస్.రాధాకృష్ణ నిర్మిస్తున్నారు. ఈ మూవీలో హీరోయిన్లుగా శ్రీలీల, మీనాక్షి చౌదరి నటిస్తున్నారు. ఈ మూవీలో మహేష్ బాబుకు తల్లిగా ఒకప్పటి స్టార్ హీరోయిన్ నటిస్తుందట. ఆమె ఎవరో ఇప్పుడు చూద్దాం..
గుంటూరు కారం సినిమా మొదలైనప్పటి నుండి ఏదో ఒక అడ్డంకి ఎదురవుతూనే ఉంది. ఆ తరువాత హీరోయిన్ పూజా హెగ్డే తప్పుకుందని వార్తలు వచ్చాయి. ఆ తరువాత మ్యూజిక్ డైరెక్టర్ తమన్, సినిమాటోగ్రాఫర్ తప్పుకున్నారని వార్తలు వైరల్ అయ్యాయి. గత కొద్దిరోజులుగా ఈ మూవీ వార్తల్లో నిలుస్తూనే ఉంది. సెకండ్ హీరోయిన్ గా తీసుకున్న శ్రీలీల, మెయిన్ హీరోయిన్ అవగా, సెకండ్ హీరోయిన్ గా మీనాక్షి చౌదరి తీసుకున్నారని తెలుస్తోంది. జగపతి బాబు ఈ మూవీలో విలన్ గా నటిస్తున్నారు. ఇటీవలే ఈ మూవీ షూటింగ్ మళ్ళీ మొదలుపెట్టారు. నాన్ స్టాప్ గా షూటింగ్ కొనసాగుతోందని తెలుస్తోంది. ప్రస్తుతం హైదరాబాద్లో చిత్రీకరిస్తున్నారు. ఈ మూవీ షూటింగ్ స్పాట్ నుండి ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో లీక్ అయ్యాయి. అవి క్షణాల్లో వైరల్ గా మారాయి. మహేష్ బాబు తల్లిగా ఈ మూవీలో సీనియర్ హీరోయిన్ నటిస్తున్నట్టు తెలుస్తోంది. ఆమె ఎవరో కాదు రమ్యకృష్ణ.
ఒకప్పుడు స్టార్ హీరోయిన్ గా అగ్ర హీరోలందరితో నటించిన రమ్యకృష్ణ, కొన్నేళ్ళ నుండి హీరోలకు తల్లిగా, కీలక పాత్రలలో నటిస్తోంది. ఇటీవల జైలర్ మూవీలో రజినికాంత్ భార్యగా నటించింది. రమ్యకృష్ణ ప్రస్తుతం గుంటూరు కారంలో మహేష్ బాబు తల్లిగా నటిస్తోంది. అయితే వీరిద్దరు ఇంతకు ముందు ‘నాని’ మూవీలో కలిసి నటించారు. మళ్ళీ 19 ఏళ్ల తరువాత గుంటూరు కారంలో నటిస్తున్నారు.
Also Read: హీరో “వేణు తొట్టెంపూడి” నటించిన తొలి వెబ్‌సిరీస్ “అతిథి” ఎలా ఉందంటే..?
End of Article