హీరో “వేణు తొట్టెంపూడి” నటించిన తొలి వెబ్‌సిరీస్‌ “అతిథి” ఎలా ఉందంటే..?

హీరో “వేణు తొట్టెంపూడి” నటించిన తొలి వెబ్‌సిరీస్‌ “అతిథి” ఎలా ఉందంటే..?

by kavitha

Ads

హీరో వేణు తొట్టెంపూడి గురించి నేటి తరం ఆడియెన్స్ కు అంతగా తెలియకపోవచ్చు. కానీ 90 ల ప్రేక్షకులకు ఆయన సుపరిచితమే. స్వయంవరం సినిమాతో ఇండస్ట్రీలో అడుగుపెట్టి, మొదటి మూవీతోనే సూపర్ హిట్ అందుకున్నారు. తనదైన నటనతో, డైలాగ్ డెలివరితో ఎంతో గుర్తింపును, అభిమానులను సొంతం చేసుకున్నారు. చిరునవ్వుతో, చెప్పవే చిరుగాలి వంటి పలు హిట్ సినిమాలలో నటించి, ఆడియెన్స్ ను విశేషంగా ఆకట్టుకున్నారు.

Video Advertisement

కొన్నేళ్ళ నుండి సినిమాలకు దూరంగా ఉన్న హీరో వేణు గతేడాది రామారావు ఆన్ డ్యూటీతో రీ ఎంట్రీ ఇచ్చారు. వేణు తొలిసారిగా  ‘అతిథి’ అనే హర్రర్ వెబ్‌సిరీస్‌లో నటించారు. తాజాగా ఈ వెబ్‌సిరీస్‌ ప్రముఖ ఓటీటీ ‘డిస్నీ+ హాట్‌స్టార్‌’ లో రిలీజ్ అయ్యింది.  అయితే ఆ వెబ్ సిరీస్ కథ ఏమిటో? ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం..
అతిథి వెబ్ సిరీస్ ను ప్రవీణ్ నిర్మించగా, భరత్‌ వై.జి. తెరకెక్కించారు. హీరో వేణు తొట్టెంపూడి ప్రధాన పాతరలో నటించిన ఈ సిరీస్ లో అవంతిక మిశ్రా, అదితి గౌతమ్‌ ,వెంకటేశ్‌ కాకుమాను, రవి వర్మ కీలక పాత్రలలో నటించారు. ఇక ఈ సిరీస్ కథ విషయానికి వస్తే, స్టోరీ రైటర్ రవి వర్మ (వేణు తొట్టెంపూడి), సంధ్య (అదితి గౌతమ్) భార్యాభర్తలు. సంధ్య నిలయం అనే పెద్ద భవనంలో జీవిస్తూ ఉంటారు. రవివర్మ భార్య సంధ్యకు పక్షవాతం రావడం వల్ల బెడ్ కే  పరిమితమవుతుంది. రవివర్మ భార్యకు సేవలు చేస్తూ, కథలు రాస్తూ జీవిస్తుంటాడు.
ఒక రోజు అతను రాసిన స్టోరీలోలానే వర్షం కురిసిన ఆ రాత్రి రవివర్మ బంగ్లాకి మాయ (అవంతిక) అనే యువతి వస్తుంది. మరోవైపు  యూట్యూబర్ అయిన సవేరి (వెంకటేష్ కాకుమాను) దెయ్యాలు లేవనే కాన్సెప్ట్ తో వీడియోలు తీసి తన ఛానెల్ లో పెడుతుంటాడు. ఆ క్రమంలోనే సవేరి తనను దెయ్యం వెంబడిస్తుందనే భయంతో రవివర్మ బంగ్లాకి వస్తాడు. సవారి మాయను దెయ్యం అని సందేహపడుతాడు. కానీ ఆ ఇంట్లోనే మాయ మరణిస్తుంది. ఆమె చనిపోవడానికి కారణం ఎవరు? మాయ దెయ్యం అనుకున్న సవారి సందేహం నిజమైందా? ఆఖరికి ఏం జరిగింది అనేది మిగిలిన కథ. ఆరు ఎపిసోడ్ లతో రూపొందిన ఈ వెబ్ సిరీస్ లో తొలి మూడు ఎపిసోడ్స్ క్యూరియాసిటీ కలిగేలా చేశాయి. అయితే ఆ తర్వాత ఎపిసోడ్ లు రొటీన్ ఫార్మేట్లోకి వచ్చిన భావన కలుగుతుంది. హీరో వేణు ఇప్పటివరకు కామెడీ పాత్రలను  ఎక్కువగా చేశాడు. ఇందులో పూర్తిగా సీరియస్‌ పాత్రలో కనిపిస్తారు. రచయిత రవి వర్మగా సెటిల్డ్ గా నటించాడు. అధితి గౌతమ్ సంధ్యగా పర్వాలేదనిపించింది. మాయ పాత్ర చేసిన అవంతిక నటనతో ఆకట్టుకుంది.

Also Read: ప్రభాస్‌కి ఇవ్వడమే కానీ చేయి చాచి తిరిగి అడగడం తెలియదు: జగపతిబాబు

 

 


End of Article

You may also like