“పుష్ప: ది రైజ్” సినిమాతో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ పాన్ ఇండియా స్టార్ గా మారిపోయారు. సుకుమార్ దర్శకత్వంలో ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యం లో భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని సాధించింది.

Video Advertisement

ఇక ఈ సినిమాలో పుష్ప రాజ్ పాత్రలో అల్లు అర్జున్ అద్భుతమైన నటనను కనబరిచారు. ఇక ఈ సినిమా రెండవ భాగమైన “పుష్ప: ది రూల్” పైన అంచనాలు రోజు రోజుకీ పెరుగుతూ వస్తున్నాయి.

is allu arjun following that sentiment for pushpa 2..??

ఇక ఈ సినిమా ఎప్పుడెప్పుడు విడుదల అవుతుందా అని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం పుష్ప ది రూల్ సినిమాకు సంబంధించి చిత్ర యూనిట్ వర్క్ చేస్తోంది. అయితే తాజాగా వచ్చిన సమాచారం ప్రకారం పుష్ప: ది రూల్ సినిమా షూటింగ్ ని బ్యాంకాక్ లో చేస్తారని కూడా వార్త వచ్చింది.

ఇదిలా ఉంటే ఈ సినిమాకి సంబంధించి మరో అప్డేట్ వచ్చింది. ఈ సినిమాలో మరో కీలక పాత్ర వుంటుందట. అయితే ఆ పాత్ర లో కేథరీన్ థెరీసా నటించనున్నట్టు తెలుస్తోంది. ఈమె ఓ నెగిటివ్ పాత్ర ని చేయనున్నారట. అలానే మనోజ్ బాజ్ పాయ్ కూడా ఓ కీలకమైన రోల్ చేస్తున్నారట. పోలీస్ గా ఈ సినిమాలో చేస్తున్నట్టు టాక్. అదే విధంగా గిరిజన యువతి పాత్రలో సాయి పల్లవి కూడా ఉండబోతుంది.  సాయి పల్లవి ఈ సినిమాలో ఒక పది నిముషాలు కనపడుతుందిట.