ఒక సమయం వరకు కేవలం సినిమాల్లో నటించే వారిని, అయితే రాజకీయాల్లో ఉన్న వారిని లేదా మరి ఏదైనా రంగంలో ఉండి బాగా గుర్తింపు సంపాదించుకున్న వారిని సెలబ్రిటీలు అనేవారు. కానీ సోషల్ మీడియా వచ్చిన తర్వాత ఈ విధంగా కూడా గుర్తింపు సంపాదించుకోవచ్చు అని చాలా మంది నిరూపించారు. తమ టాలెంట్ ని గుర్తించడానికి సోషల్ మీడియాని ఒక మాధ్యమంగా వాడుకొని ఎంతోమంది పాపులారిటీ, క్రేజ్ సంపాదించుకున్నారు.

Video Advertisement

అలా సోషల్ మీడియా ద్వారా ఎంతో మంది సెలబ్రిటీలు అయ్యారు. ఒకరు వారికి తోచిన విధంగా వారి అభిప్రాయాలను సోషల్ మీడియా ద్వారా షేర్ చేస్తూ, అలాగే రీల్స్ చేస్తూ గుర్తింపు సంపాదించుకున్నారు. అలా సోషల్ మీడియా ద్వారా ఫేమస్ అయిన తర్వాత సినిమాల్లోకి, టీవీలోకి వచ్చిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. ఇప్పుడు సోషల్ మీడియా ద్వారా అలాగే ఫేమస్ అయిన ఒక సెలబ్రిటీ చరిష్మా రెడ్డి.

this instagrammer became famous in social media

చరిష్మా రెడ్డి ఒక యాక్టర్. అలాగే ఇన్‌స్టాగ్రామ్‌లో రీల్స్ కూడా చేసి చాలా పాపులర్ అయ్యారు. ఇటీవల హిట్ 2 ప్రమోషన్స్ లో భాగంగా హీరో అడివి శేష్, హీరోయిన్ మీనాక్షి చౌదరితో కలిసి రీల్ చేశారు. అలాగే అంతకు ముందు కూడా ఎంతో మంది ప్రముఖ సెలబ్రిటీలతో కలిసి దిగిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు. చరిష్మాకి సోషల్ మీడియాలో చాలా క్రేజ్ ఉంది. ఎంతో మంది ఫాలోవర్స్ ఉన్నారు.