లాయర్ అయ్యుండీ పరోటా స్టాల్ నడుపుతోంది.. కూతురు కోసం ఈమె చేస్తున్న సాహసం చూస్తే హ్యాట్సాఫ్ అంటారు..!

లాయర్ అయ్యుండీ పరోటా స్టాల్ నడుపుతోంది.. కూతురు కోసం ఈమె చేస్తున్న సాహసం చూస్తే హ్యాట్సాఫ్ అంటారు..!

by Anudeep

Ads

మహిళలు అబలలు కాదు సబలలే అని నేటి తరం మహిళలు నిరూపించుకుంటున్నారు. ఒకప్పుడు ఇంట్లో మగవారిపైనే ఆధారపడి జీవించేవారు. కానీ, ఇప్పుడు రోజులు మారాయి. ఆడవారు తమకు తాము సంపాదించుకుంటూ కుటుంబాలను నెట్టుకొస్తున్నారు. భర్త ఆసరా లేకపోయినా తమంతట తాముగా నిలదొక్కుకోగలుగుతున్నారు.

Video Advertisement

ఈ స్టోరీ వింటే మీరు కచ్చితంగా ఇన్స్పైర్ అవుతారు. ఈమె పేరు నేహా శర్మ. పంజాబ్… జలంధర్‌కి చెందిన వ్యక్తి. ఈమెకు ఒక కూతురు ఉంది. ఈమె జీవితమంతా ముళ్ల బాటే. అయినా కష్టపడి నిలదొక్కుకుంది.

ఆమె సంసారం కూతురు పుట్టేవరకు బాగానే ఉంది. కానీ, కూతురు పుట్టిన ఏడాది తరువాత ఆమె సంసారంలో చిక్కులు మొదలయ్యాయి. ఆమె భర్త వదిలేసి వెళ్ళిపోయాడు. ఎల్ ఎల్ బి లాయర్ గా చేస్తూ ఉన్న నేహా శర్మ పరిస్థితులకు భయపడి కుంగిపోలేదు. ఏడాది వయసున్న కూతురుని చూసి గుండె దిటవు చేసుకుంది. భర్త వదిలేసి వెళ్ళిపోయినా.. తాను జీవిత పోరాటంలో గెలవాలని అనుకుంది. చేతిలో ఉన్న కొద్ది డబ్బుతో “శర్మ పరాటా జంక్షన్” ను ప్రారంభించింది.

lawer 2
రోజు స్కూటీ పైనే వచ్చి తన హోటల్ ను ప్రారంభిస్తుంది. పంజాబ్ లోనే అతిపెద్ద పరాటాను అమ్ముతోంది. కేవలం పరాటాని మాత్రమే కాకుండా టీ, కాఫీ లను కూడా అమ్ముతూ ఉంటుంది. ఇప్పుడు ఆమె కూతురు వయసు 15 సంవత్సరాలు. ఒలింపిక్స్ లో భారత్ తరపున ప్రాతినిధ్యం వహించాలని ఆమె కలలు కంటోంది. కూతురి లక్ష్యం నెరవేర్చడమే తన లక్ష్యంగా నేహా శర్మ కృషి చేస్తున్నారు. ఆడపిల్లలు వెనక్కి తగ్గకూడదు అని, ధైర్యంగా తమ లక్ష్యాన్ని చేరుకోవాలని ఆమె చాటి చెప్తున్నారు.


End of Article

You may also like