తెలుగు వెండి తెరపై అద్భుతమైన హస్యంతో ఆకట్టుకున్న గొప్ప హాస్యనటులలో ఏవీఎస్ కూడా ఒకరు. తనదైన కామెడీ టైమింగ్ తో, హావభావాలతో, డైలాగ్ డెలివరీతో తెలుగు ప్రేక్షకులను నవ్వించేవారు. వందల సంఖ్యల సినిమాలలో నటించిన ఏవీఎస్ తన కామెడీతో ఆడియెన్స్ ను నవ్వించడమే కాకుండా, సెంటిమెంట్ సీన్స్ లో ఆడియెన్స్ ఏడిపించిన సందర్భాలు అనేకం ఉన్నాయి.

Video Advertisement

తన నటనతో తెలుగు ప్రేక్షకుల మనసుల్లో ఏవీఎస్ నిలిచిపోయారు. ఆయనకు ఇద్దరు సంతానం. కుమారుడు  ప్రదీప్, కుమార్తె ప్రశాంతి. ప్రశాంతి భర్త, మరియు ఏవీఎస్ అల్లుడు కూడా తెలుగు ఇండస్ట్రీలో ప్రముఖ నటుడుగా కొనసాగుతున్నారు. ఆ నటుడు ఎవరో ఇప్పుడు చూద్దాం.. ఏవీఎస్ అసలు పేరు ఆమంచి వెంకట సుబ్రహ్మణ్యం. ఆయన మొదట పౌరోహిత్యం చేసేవారు. ఆ తరువాత  విలేఖరిగా విజయవాడలో పనిచేశారు. ఆ టైమ్ లో ఏవీఎస్ ఆర్ధికంగా ఎన్నో  కష్టాలు పడ్డారు. ఎంతలా అంటే ఒక్కొసారు తినడానికి కూడా డబ్బుల లేక ఇబ్బంది పడ్డారు. ఆయన ఆకలిని భరించలేక కిళ్లీ నమిలేవారట. మిమిక్రీ షోలు చేస్తూ డబ్బులు సంపాదించేవారంట. ఆ క్రమంలో ఒక షోలో దిగ్గజ దర్శకుడు బాపు ఏవీఎస్ చూసి ‘మిస్టర్ పెళ్ళాం’  మూవీలో అవకాశం ఇచ్చారు.
ఆ మూవీ హిట్ అవడంతో ఏవీఎస్ మంచి గుర్తింపు వచ్చి, వరుసగా సినిమాలలో అవకాశాలు రావడంతో కామెడియన్ గా, సహాయ నటుడిగా వందల సినిమాలలో నటించి మెప్పించారు. ఆయన సుమారు 750 చిత్రాలలో నటించారు.  మాయలోడు, యమలీల, ఘటోత్కచుడు, సిసింద్రీ, మావిడాకులు, ఆవిడా మా ఆవిడే, జయం మనదేరా,  వెంకీ, అదిరిందయ్యా చంద్రం, యమగోల మళ్ళీ మొదలైంది, బంగారం, బెండు అప్పారావు, శ్రీరామదాసు, సంక్రాంతి, రాధాగోపాళం వంటి ఎన్నో హిట్ చిత్రాలలో నటించి పేరు, ప్రఖ్యాతులు సంపాదించుకున్నారు.ఇది ఇలా ఉంటే, ఏవీఎస్ అల్లుడు కూడా టాలీవుడ్ లో ప్రముఖ నటుడుగా కొనసాగుతున్నాడు. ఆయన పేరు శ్రీనివాస్ చక్రవర్తి. అయితే పాపులర్ అయిన పేరు చింటు. అవును సినిమాలో చేసిన పాత్రకు గుర్తింపు వచ్చింది. చింటు వాల్తేరు వీరయ్య, బంగార్రాజు, తీస్ మార్ ఖాన్, ఎఫ్ 3, రాజా ది గ్రేట్ వంటి సినిమాలలో నటించారు.

Also Read: సినిమా ఓకే చేయడానికి “వైష్ణవి చైతన్య” ఈ కండిషన్స్ పెడుతున్నారా..? అవి ఏంటంటే..?