Ads
అల్లు అర్జున్ కి పుష్ప సినిమా మంచి హిట్ ని ఇచ్చింది. ఈ సినిమా అల్లు అర్జున్ మొదటి పాన్ ఇండియా. ఈ సినిమాలో ఎర్ర చందనం సీన్స్ బాగా హైలైట్ అయ్యాయి. ఈ సినిమా భారీ కలెక్షన్లు రాబట్టింది. పైగా ఎంతో మంది హృదయాలను గెలుచుకుంది. అల్లు అర్జున్ యాక్టింగ్ కి ఎంతో మంది ఫిదా అయిపోయారు. తాజాగా ఫిలిం ఫేర్
అవార్డ్స్ లో కూడా పుష్ప హవానే నడిచింది.
Video Advertisement
దీనికి రెండవ భాగం కూడా ఉంది అనే విషయం తెలిసిందే. ఇటీవలే పూజా కార్యక్రమాలు జరుపుకున్న పుష్ప పార్ట్-2 అయిన పుష్ప-ద రూల్ సినిమా రెగ్యులర్ షూటింగ్ త్వరలోనే ప్రారంభంకాబోతుంది. అయితే ఈ సెకండ్ పార్ట్ గురించి గత కొద్ది రోజులుగా ఎన్నో వార్తలు వస్తూ ఉన్నాయి. ఇతర కమిట్‌మెంట్‌ల కారణంగా అల్లు అర్జున్ మరియు రష్మిక మందన్న మహూరత్ పూజా కార్యక్రమంలో పాల్గొనలేకపోయారు.
పుష్ప సినిమా థియేటర్లలో విడుదల అయినప్పటికంటే, ఇప్పుడే చాలా మంచి టాక్ వస్తోంది. ఎంతో మంది సెలబ్రిటీలు సినిమా చూసి, సినిమా చాలా బాగుంది అని, అల్లు అర్జున్ ఈ సినిమాలో చాలా బాగా నటించారు అని సోషల్ మీడియా ద్వారా పొగుడుతున్నారు. కేవలం తెలుగు సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన ప్రముఖులు మాత్రమే కాకుండా, బాలీవుడ్ కి సంబంధించిన ఎంతో మంది పెద్ద పెద్ద సెలబ్రిటీలు కూడా అల్లు అర్జున్ నటనని ప్రశంసించారు. దాంతో పుష్ప రెండవ పార్ట్ విడుదలకి అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
పుష్ప సినిమా సూపర్ హిట్ అవడానికి కొన్ని సీన్స్ కూడా ముఖ్య కారణంగా నిలిచాయి. అందులోనూ ఎర్రచందనం దుంగలని ఒక చోట నుండి మరొక చోటికి తీసుకువెళ్లే సీన్ అయితే సినిమాకి ఒక హైలైట్ గా నిలిచింది. ఈ సినిమాలో పోలీసులు రైడ్ చేయడానికి వస్తున్నారు అని తెలిసి హీరో ఎర్రచందనం దుంగలని నీటిలో పడేస్తాడు. ఇదే సీన్ మరొక సినిమాలో కూడా ఉంది. విజయ్ కాంత్ హీరోగా నటించిన కెప్టెన్ ప్రభాకర్ అనే సినిమాలో దాదాపు ఇలాంటి సీన్ ఒకటి ఉంటుంది. ఈ సినిమాకి సెల్వమణి దర్శకత్వం వహించారు. ఇందులో హీరో కూడా ఇలాగే నీటి ద్వారా ఎర్రచందనాన్ని తరలిస్తున్న ఒక ముఠాని పట్టుకుంటాడు.
watch video :
పుష్ప సినిమా ఎవరు ఊహించని అంతగా సెన్సేషన్ క్రియేట్ చేసి బాక్సాఫీస్‌ను షేక్ చేసింది. పాన్ ఇండియా లెవెల్ లో రిలీజ్ అయిన ఈ మూవీ అన్ని వర్గాల ప్రేక్షకుల నుంచి ఆదరణ అందుకుంది. ఈ మూవీలో సాంగ్స్ సరికొత్త రికార్డును సృష్టించాయి అనడంలో వింత ఏమీ లేదు. అయితే ఈ మధ్య కొత్తగా పుష్ప 2 గురించి ఇంకో వార్త వైరల్ అవుతుంది. అదే…పుష్ప: ది రైజ్ సీక్వెల్‌లో సాయి పల్లవి సుకుమార్‌తో కలిసి పని చేయడానికి సిద్ధంగా ఉంది అన్న విషయం.
నివేదికల ప్రకారం, పుష్ప 2: ద రూల్‌లో నటించడానికి దర్శకుడు సుకుమార్ ఆమెను సంప్రదించారని , ఈ చిత్రంలో సాయి పల్లవి ఒక గిరిజన అమ్మాయి పాత్రలో కనిపించనుందని సమాచారం. సాయి పల్లవి ఇప్పటికే ప్రతిపాదనకు పచ్చ జెండా ఊపారని. ఇక కేవలం ఆమె రెమ్యూనరేషన్ ఖరారు కావలసి ఉందని, అయిన వెంటనే అల్లు అర్జున్ తో ఆమె నటించే ఈ చిత్రం షూటింగ్‌ను త్వరలో ప్రారంభిస్తారని ఊహా గానాలు కూడా ఉన్నాయి.
End of Article