ఎన్నో చిత్రాలలో ప్రభాకర్ విలన్ గా నటించారు. అయితే ఒక సినిమాలో అయితే నిజంగా పులితో పోరాడిన నటుడు ప్రభాకర్. మామూలుగా ఎవరికైనా పులి అంటే భయమే. కానీ ఈ నటుడు ఆ పులితోనే ఫైట్ చేశాడు.

Video Advertisement

తన యొక్క నటనతో ప్రేక్షకులను ఎంతగానో మెప్పించాడు. చిన్న వయసులోనే సినీరంగంలోకి వచ్చాడు. ఆ తర్వాత ఎన్నో విలన్ పాత్రలు చేశాడు. ప్రతీకారం సినిమాలో ఆయన చేసిన సాహసం ఎప్పటికి మర్చిపోలేము. పులి తో ఫైట్ చేయడం అంటే మామూలు విషయమా..? ఆ ఫైట్ తర్వాత నుంచి టైగర్ ప్రభాకర్ గా మారిపోయాడు ఈ నటుడు.

తెలుగు మాత్రమే కాకుండా కన్నడ, తమిళ చిత్రాల్లో కూడా నటించాడు. ఇలా అన్ని భాషలతో కలిపి మొత్తం మూడు వందల సినిమాల్లో ప్రభాకర్ నటించడం జరిగింది. బాలీవుడ్ లో కూడా తన సత్తా ఏంటో చూపించాడు ఈ నటుడు. టాలీవుడ్ లో అయితే చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్, నాగార్జున వంటి స్టార్ హీరోలతో విలన్ రోల్స్ చేశాడు.

2000 సంవత్సరంలో తీవ్ర అనారోగ్యానికి గురయ్యాడు ప్రభాకర్. ఆరోగ్య సమస్యల వల్ల ఎంతగానో ఇబ్బందిపడ్డాడు. జాండీస్ కూడా వచ్చింది. 2001 మార్చి 25న చికిత్స తీసుకుంటూ మరణించాడు. అయితే చివరి రోజుల్లో ఈ గొప్ప నటుడిని చూసుకునే వారు ఎవరూ లేకపోవడం బాధాకరం. ఆ ఆవేదనతోనే ప్రభాకర్ కన్నుమూశారు.