This Week OTT releases: ఓటీటీలో ఈ వారం రాబోతున్న చిత్రాలివే.. ఓ లుక్కేయండి..!

This Week OTT releases: ఓటీటీలో ఈ వారం రాబోతున్న చిత్రాలివే.. ఓ లుక్కేయండి..!

by kavitha

Ads

This Week OTT releases: ఓటీటీ మార్కెట్ కరోనా వచ్చిన తర్వాత నుండి మంచి ఫామ్ లోకి వచ్చింది. ఇక వర్గం ప్రేక్షకులు ఓటీటీల వైపే ఆసక్తి చూపుతున్నారు. ప్రముఖ ఓటీటీ సంస్థలు కూడా వారికి అనుగుణంగా ప్రతీ వారం సరికొత్త సూపర్ హిట్ సినిమాలు, వెబ్ సిరీస్‌లను స్ట్రీమింగ్ చేస్తున్నాయి. ఇంతకుముందు శుక్రవారం వచ్చిందంటే చాలు థియేటర్లలో సినిమాల హడావిడి చాలా ఉండేది.

Video Advertisement

ఇపుడు ఓటీటీలో కూడా విడుదల అవుతున్నాయి. ఓటీటీ వేదికలు చిన్న చిత్రాలకు స్వర్గదామంగా మారాయి. కంటెంట్ బాగుండాలే కానీ ఒటీటీ, థియేటర్లేంటి ఎక్కడైనా చూసేందుకు ప్రేక్షకులు సిద్ధంగా ఉన్నారు.ఎప్పటిలానే ఈ వారం కూడా ఓటీటీల్లో పలు సినిమాలు ప్రేక్షకులను పలకరించబోతున్నాయి. అవేంటో చూద్దాం పదండి.

కాంతారా:
రిషబ్ శెట్టి హీరోగా నటించి, దర్శకత్వం వహించిన కాంతారా కన్నడంలో చిన్న సినిమాగా విడుదలై,పాన్ ఇండియా మూవీగా సూపర్ హిట్ అయ్యింది. ‘కాంతారా’ఒక్క భాషలో కాదు, విడుదలైన ప్రతీ భాషలోనూ బ్లాక్‌బస్టర్ హిట్ సాధించడమే కాకుండా వసూళ్లు పరంగా రికార్డులు సృష్టించింది. ఈ సినిమా 24 నవంబర్, 2022 నుండి అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ కానున్నట్లు సమాచారం.అయితే అది పే పర్ వ్యూ లేదా ఉచితంగానా అనేది ఇంకా తెలియాల్సి ఉంది. కాగా, ఈ సినిమాని హోంబలే ఫిలిమ్స్ బ్యానర్‌ పై నిర్మించారు. కన్నడంలోఈ మూవీ సెప్టెంబర్ 30వ తేదీన విడుదల అయింది. అయితే తెలుగులో అక్టోబర్ 15న విడుదల చేశారు.

ప్రిన్స్:
తమిళ హీరో శివ కార్తికేయన్, ‘జాతిరత్నాల’ ఫేం అనుదీప్ దర్శకత్వంలో రూపొందిన సినిమా ‘ప్రిన్స్‘.ఇందులో మారియా ర్యాబోషప్క హీరోయిన్‌గా నటించింది. ప్రిన్స్ మూవీ తెలుగు, తమిళ భాషల్లో ద్విభాషా చిత్రంగా తెరకెక్కింది. కామెడీ ఎంటర్టైనర్‌గా అక్టోబర్ 21వ తేదీన విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర అయితే ఆశించిన స్థాయిలో విజయం సాధించలేదు. అయితే థియేటర్లలో ప్రిన్స్ సినిమా చూడని ప్రేక్షకుల కోసం నవంబర్ 25వ తేదీ నుంచి డిస్నీ హాట్‌స్టార్‌లో ప్రసారం అవనుంది. ఆ రోజు నుండి తెలుగు, తమిళం భాషల్లో ఫ్యాన్స్‌కు అందుబాటులోకి రాబోతుంది.

Chup: R Balki film starring Dulquer Salmaan, Sunny Deol gets release date | Bollywood Bubble
చుప్:
దర్శకుడు ఆర్.బాల్కీ తెరకెక్కించిన మూవీ ‘చుప్’. ఈ సినిమాలో దుల్కర్ సల్మాన్, శ్రియా ధన్వంతరి కలిసి నటించారు.ఓ ఆర్టిస్ట్ రివెంజ్ తీవ్ర విమర్శలు చేసే ఫిల్మ్ క్రిటిక్స్‌ పై పగ తీర్చుకుంటే ఎలా ఉంటుందనేది కథ. ఇంకా ఈ మూవీలో సన్నీ డియాల్ కీలక పాత్ర పోషించారు. దుల్కర్ నటనకు మంచి మార్కులు పడ్డాయి. అదే కాకుండా ఈ మూవీకి విమర్శకుల నుంచి ప్రశంసలు కూడా అందాయి. ఈ సినిమా ఈ నెల 25వ తేదీ నుండి ఓటీటీ జీ5లో స్ట్రీమింగ్ కాబోతుంది.


End of Article

You may also like