Ads
గత రెండేళ్లు గా కరోనా మహమ్మారి మానవ జీవితాన్ని అస్తవ్యస్తం చేసింది. ఈ మహమ్మారి కారణం గా ఎంతోమంది ఆదాయాలను కోల్పోయారు. బతుకుతెరువు లేక అవస్థలు పడుతున్నారు. ఈ పరిస్థితిలో ఓ గృహిణి కి వచ్చిన ఐడియా ఆమెను లక్షల ఆదాయాన్ని పొందేలా చేసింది. ఆమె స్టోరీ ఏంటో ఈరోజు తెలుసుకుందాం.
Video Advertisement
ఆమె పేరు హీనా హోగీష్ భేడా. ఆమెకు పెళ్ళై పదిహేనేళ్ళు అయింది. ఆమెకు ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. అయితే.. మొదట పుట్టిన కొడుకు డెలివరీ సమయానికంటే ఏడు వారాలు ముందే పుట్టాడు. ఆ బాబు పుట్టినసమయం లో ఆరోగ్యంగానే ఉన్నాడు. కానీ.. వయసు పెరుగుతున్న కొద్దీ అతనిలో రోగనిరోధక శక్తీ తగ్గిపోవడాన్ని హీనా గుర్తించారు.
దీనికి పరిష్కారం ఏంటా అని ఆమె ఆలోచించారు. వనమూలికల ద్వారా ఆ బాబు ఆరోగ్యాన్ని తిరిగి తీసుకురావాలని ఆమె అనుకున్నారు.
వెంటనే అందుకు సంబంధించి పనులను కూడా మొదలుపెట్టారు. వనమూలికల గురించి లోతు గా అధ్యయనం చేసారు. అశ్వగంధ, మోరింగ, గిలాయ్ వంటి వనమూలికల గురించి తెలుసుకుంది. వీటితో తయారుచేసిన టీపొడి తో టీ చేసుకుని తాగితే రోగ నిరోధక శక్తీ పెరుగుతుందని గ్రహించింది. అందుకోసం కూడా ప్రయత్నాలు చేసింది.
కెఫీన్ పదార్ధం లేకుండానే.. ఈ వనమూలికలతో టీ పొడి చేసి అమ్మడం ప్రారంభించింది. ఆమె ఉత్పత్తులకు మంచి డిమాండ్ ఏర్పడడం తో తన వ్యాపారాన్ని విస్తరించింది. రెండు లక్షలతో పెట్టుబడి పెట్టిన ఆమె నేడు నెలకి రెండున్నర లక్షల లాభాన్ని పొందగలిగే స్థితి కి చేరుకుంది.
తన వ్యాపారాన్ని విస్తరించింది. మరికొందరికి పని కల్పించింది. ఆమె ఉత్పత్తులకు మరింత ఆదరణ పెరుగుతోంది. తొందరలోనే ఆమె ఆన్ లైన్ ద్వారా మరిన్ని ఉత్పత్తులను తీసుకురావడానికి ప్రయత్నించింది.
End of Article