ఆర్గ్యుమెంట్ ఆపాలనుకుంటున్నారా..? అయితే ఈ 3 విషయాలని కచ్చితంగా గుర్తుపెట్టుకోండి..!

ఆర్గ్యుమెంట్ ఆపాలనుకుంటున్నారా..? అయితే ఈ 3 విషయాలని కచ్చితంగా గుర్తుపెట్టుకోండి..!

by Mounika Singaluri

Ads

ఒక్కొక్క సారి చిన్న చిన్న ఆర్గ్యుమెంట్స్ వస్తూ ఉంటాయి. అయితే ఆర్గ్యుమెంట్స్ వచ్చేటప్పుడు వాటిని పెద్దది చేయకుండా ఉండాలి. ఒకవేళ కనుక ఇద్దరి మధ్య సంభాషణ గొడవై పోయి పెద్దగా కేకలు వేసుకోవడం అరవడం వంటివి చేస్తే రిలేషన్షిప్ దెబ్బతింటుంది.

Video Advertisement

ఎప్పుడైనా సరే ఆర్గ్యుమెంట్ పెద్దది అవుతుందని తెలిస్తే దాన్ని వదిలేసి దానిని వీలైనంత వరకు కంట్రోల్ చేస్తూ ఉండాలి. అయితే ఏదైనా ఆర్గ్యుమెంట్ వచ్చిందంటే దాన్ని ఎలా తగ్గించవచ్చు అనేది ఇప్పుడు చూద్దాం.

 

నిజానికి ఒక్కొక్కరు ఒక్కో విధంగా ఉంటారు. ఒకరి ఆలోచనా విధానం ఒక్కోలా ఉంటుంది. ప్రతి ఇద్దరు వ్యక్తులకు కూడా వేరువేరు ఉద్దేశాలు ఉంటాయి. అందుకని ఎప్పుడూ కూడా గొడవలు అంత స్పీడుగా తగ్గవు. పైగా ఇటువంటి ఆర్గ్యుమెంట్స్ రావడం వల్ల మానసికంగా ఇబ్బంది వస్తుంది. ముఖ్యంగా మీరు ఇష్టపడే వ్యక్తులు తో ఆర్గ్యుమెంట్స్ జరిగినప్పుడు. అయితే ఇటువంటి సమస్యలకు ఎలా చెక్ పెట్టొచ్చు అనేది ఇప్పుడు చూద్దాం.

#1. పాజిటివ్ వైపు ఫోకస్ చేయండి:

వీలైనంత వరకు నెగిటివ్ గా చూడకుండా పాజిటివ్ గా ఆలోచిస్తూ ఉండండి మీరు కనుక పాజిటివ్ గా ఆలోచిస్తూ ఉంటే ఖచ్చితంగా సమస్యలు తగ్గుతాయి. ఆర్గ్యుమెంట్ కూడా వీలైనంత వరకు తగ్గిపోతుంది.

#2. ఇతరుల్ని విమర్శించ వద్దు:

ఇతరుల్ని ఎప్పుడూ విమర్శించకండి. విమర్శించడం వల్ల కూడా గొడవ పెద్దది అవుతుంది. కాబట్టి వీలైనంత వరకు దీని మీద కూడా ఏకాగ్రత పెట్టి సమస్యను పరిష్కరించండి.

#3. నిశ్శబ్దంగా ఉండటం వలన గొడవలు తగ్గవు:

చాలా మంది నిశ్శబ్దమే పరిష్కారం అనుకుంటారు కానీ నిజానికి అలా కుదరదు. కావాలనుకుంటే కాసేపు విరామం ఇచ్చి సమస్యను పరిష్కరించడానికి ట్రై చేయండి ఒకవేళ కనుక మీరు సమస్య ఎక్కువై పోతుంది అని అనుకుంటే విరామం ఇచ్చి నెమ్మదిగా ప్రశాంతంగా వెళ్లి మాట్లాడండి. అప్పుడు సమస్యను పరిష్కరించుకోవచ్చు. అంతే కానీ ఆవేశంలో నిర్ణయాలు తీసుకోవడం ఆలోచించకుండా మాట్లాడటం లాంటివి చేయొద్దు దీనివల్ల మీకే ఇబ్బంది.


End of Article

You may also like