యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్.. డైరెక్టర్ ఓంరౌత్ కాంబోలో రాబోతున్న చిత్రం ఆదిపురుష్. రామాయణ ఇతిహాసం నేపథ్యంలో వస్తోన్న ఈ మూవీలో ప్రభాస్ రాముడిగా.. సీతగా బాలీవుడ్ బ్యూటీ కృతి సనన్ నటిస్తున్నారు. అలాగే రావణుడిగా సైఫ్ అలీ ఖాన్ కనిపించనున్నారు. మరి కొద్ది రోజుల్లో ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకి రానుంది.

Video Advertisement

 

 

అయితే తాజాగా ఆదిపురుష్ మేకర్స్ యువీ క్రియేషన్స్, పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ సంయుక్తంగా ఒక ప్రకటన రిలీజ్ చేసిన విషయం తెలిసిందే. అది ఏమిటంటే “ఆది పురుష్‌” సినిమా ప్రదర్శించే థియేటర్లలో ఒక సీటును హనుమంతుడి కోసం ఖాళీ ఉంచడం. ఇందుకోసం ఏర్పాట్లు చేస్తున్నట్టు ఆ ప్రకటనలో చెప్పారు. దానికి సమాధానం కూడా ఆ ప్రకటనలో ఇచ్చారు.

 

know the price of the seat which is beside hanuman seat in aadipurush movie..!!

ఎక్కడ రామాయాణ పారాయణం జరిగినా, ఎక్కడ శ్రీరామ కథను ప్రదర్శించినా అక్కడ ఒక ఆసనాన్ని వేస్తుంటారు. అలా వేయడానికి కారణం శ్రీరామ కథను వీక్షించేందుకు ఆ స్థలానికి ఆంజనేయుడు వస్తాడని భక్తుల నమ్మకం. ఆ కారణంగానే మూవీ యూనిట్‌ కూడా ఆంజనేయుడి కోసం ఒక సీటును ప్రత్యేకంగా కేటాయించాలని నిర్ణయం తీసుకున్నట్టు ప్రకటనలో తెలిపింది.

know the price of the seat which is beside hanuman seat in aadipurush movie..!!

అయితే ఈ హనుమంతుడి సీట్ పక్కన ఉండే సీట్ ధర ప్రస్తుతం వైరల్ అవుతోంది. సాధారణ సీట్ ధర 250 రూపాయలు ఉంటే.. హనుమంతుని సీట్ పక్క సీట్ ధర 500 రూపాయలుగా నిర్ణయించినట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన వివరాలు ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారాయి.

know the price of the seat which is beside hanuman seat in aadipurush movie..!!

ఇక మరోవైపు ఈ చిత్రం జూన్ 16న సినిమా విడుదల కానుంది. ఈ నేపథ్యంలో చిత్ర ప్రమోషన్స్ ని వేగవంతం చేసారు మేకర్స్. ఈ సినిమాను టి సిరీస్ సంస్థ 500 కోట్ల భారీ బడ్జెట్ తో నిర్మించింది. ఈ ఏడాది జనవరిలోనే ఈ సినిమా రిలీజ్ అవ్వాల్సి ఉండగా కొన్ని కారణాల వల్ల వాయిదా వేశారు. ఇక ఫైనల్ గా ప్రేక్షకుల ముందుకి రానుంది. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజ్ అయిన ట్రైలర్, పాటలు.. పోస్టర్స్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.

Also read: “ఆదిపురుష్” సెన్సార్ రివ్యూ..! సినిమా హిట్టా..? ఫట్టా..?