యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్.. డైరెక్టర్ ఓంరౌత్ కాంబోలో రాబోతున్న చిత్రం ఆదిపురుష్. రామాయణ ఇతిహాసం నేపథ్యంలో వస్తోన్న ఈ మూవీలో ప్రభాస్ రాముడిగా.. సీతగా బాలీవుడ్ బ్యూటీ కృతి సనన్ నటిస్తున్నారు. అలాగే రావణుడిగా సైఫ్ అలీ ఖాన్ కనిపించనున్నారు. మరో పది రోజుల్లో ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకి రానుంది.

Video Advertisement

మొదటి నుంచి ఎన్నో అంచనాలు నెలకొన్న ఈ మూవీ కోసం అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ చిత్రం జూన్ 16న సినిమా విడుదల కానుంది. ఈ నేపథ్యంలో చిత్ర ప్రమోషన్స్ ని వేగవంతం చేసారు మేకర్స్. ఈ సినిమాను టి సిరీస్ సంస్థ 500 కోట్ల భారీ బడ్జెట్ తో నిర్మించింది. ఈ ఏడాది జనవరిలోనే ఈ సినిమా రిలీజ్ అవ్వాల్సి ఉండగా కొన్ని కారణాల వల్ల వాయిదా వేశారు. ఇక ఫైనల్ గా జూన్ 16న ప్రేక్షకుల ముందుకి రానుంది.

aadipurush censor report out...!

 

ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజ్ అయిన ట్రైలర్, పాటలు.. పోస్టర్స్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ఇక విడుదల తేదీ దగ్గరపడుతుండటం తో ఈ చిత్రం సెన్సార్ పూర్తి చేసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. సెన్సార్ సభ్యులు ఈ చిత్రానికి క్లీన్ U సర్టిఫికేట్ ఇచ్చినట్లు సమాచారం. అలాగే ఫస్ట్ హాఫ్ బాగుంది అని.. సెకండ్ హాఫ్ అద్భుతంగా ఉందని తెలుస్తోంది. ఈ చిత్రం తో ప్రభాస్ ఫుల్ బాంగ్ తో దూసుకు వస్తాడని సెన్సార్ రిపోర్ట్ ఒకటి బయటకి వచ్చింది.

aadipurush censor report out...!

తాజాగా ఆదిపురుష్ మేకర్స్ యువీ క్రియేషన్స్, పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ సంయుక్తంగా ఒక ప్రకటన రిలీజ్ చేశారు. ఈ ప్రకటన ఆంజనేయస్వామి భక్తులకు గూస్ బంప్స్ ను తెప్పిస్తోంది. అది ఏమిటంటే “ఆది పురుష్‌” సినిమా ప్రదర్శించే థియేటర్లలో ఒక సీటును హనుమంతుడి కోసం ఖాళీ ఉంచడం. ఇందుకోసం ఏర్పాట్లు చేస్తున్నట్టు ఆ ప్రకటనలో చెప్పారు.

aadipurush censor report out...!

ఎక్కడ రామాయాణ పారాయణం జరిగినా, ఎక్కడ శ్రీరామ కథను ప్రదర్శించినా అక్కడ ఒక ఆసనాన్ని వేస్తుంటారు. అలా వేయడానికి కారణం శ్రీరామ కథను వీక్షించేందుకు ఆ స్థలానికి ఆంజనేయుడు వస్తాడని భక్తుల నమ్మకం. ఆ కారణంగానే మూవీ యూనిట్‌ కూడా ఆంజనేయుడి కోసం ఒక సీటును ప్రత్యేకంగా కేటాయించాలని నిర్ణయం తీసుకున్నట్టు ప్రకటనలో తెలిపింది.

Also read: ఆదిపురుష్: “ప్రభాస్” ఫాన్స్ కి కొత్త భయం..!!