యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్.. డైరెక్టర్ ఓంరౌత్ కాంబోలో రాబోతున్న చిత్రం ఆదిపురుష్. రామాయణ ఇతిహాసం నేపథ్యంలో వస్తోన్న ఈ మూవీలో ప్రభాస్ రాముడిగా.. సీతగా బాలీవుడ్ బ్యూటీ కృతి సనన్ నటిస్తున్నారు. అలాగే రావణుడిగా సైఫ్ అలీ ఖాన్ కనిపించనున్నారు. మొదటి నుంచి ఎన్నో అంచనాలు నెలకొన్న ఈ మూవీ కోసం అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

Video Advertisement

 

 

ఈ చిత్రం జూన్ 16న సినిమా విడుదల కానుంది. ఈ నేపథ్యంలో చిత్ర ప్రమోషన్స్ ని వేగవంతం చేసారు మేకర్స్. ఈ మూవీ గ్రాఫిక్స్ విషయంలో ఎన్నో విమర్శలు ఎదురుకున్న చిత్ర యూనిట్ అవన్నీ సరి చేసుకొని ఇప్పుడు ఆడియన్స్ ముందుకు వచ్చేందుకు సిద్ధమయ్యారు. ఆదిపురుష్ మూవీ హిట్టైతే మాత్రమే ఓం రౌత్ కు ఆఫర్లు ఇవ్వాలని పలువురు హీరోలు భావిస్తున్నారని తెలుస్తోంది. అయితే తాజాగా ప్రభాస్ ఫాన్స్ కి మరో కొత్త భయం పట్టుకుంది.

aadipurush movie run time locked..!!

 

బాహుబలి తర్వాత ప్రభాస్ కి ఆ రేంజ్ హిట్ లేకపోవడంతో ప్రభాస్ ఫాన్స్ ఈ సినిమా పై ఆశలు పెంచుకున్నారు. ఆదిపురుష్ రిజల్ట్ విషయంలో ఎలాంటి నెగిటివ్ కామెంట్లు వినిపించకూడదని ఫ్యాన్స్ భావిస్తున్నారు. అయితే దర్శకుడు ఓం రౌత్ కి తెలుగుపై ఎక్కువ అవగాహన లేని నేపథ్యంలో.. తెలుగు డబ్బింగ్ ఎలా చేసారు అన్నదానిపై ప్రశ్నలు వ్యక్తం అవుతున్నాయి.

prabhas fans worried about aadipurush result..!!

ఆదిపురుష్ మూవీ డబ్బింగ్ విషయంలో మరింత కేర్ తీసుకోవాలని కామెంట్లు చేస్తున్నారు. అదిపురుష్ మేకర్స్ ఈ విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారో చూడాల్సి ఉంది. ఓం రౌత్ ఈ సినిమాకు సంబంధించిన ట్వీట్లలో తెలుగులో ఎక్కువగా తప్పులు రాయడంతో ప్రభాస్ అభిమానులు టెన్షన్ పడుతున్నారు. ఇప్పటికే రిలీజ్ అయిన ట్రైలర్ లో కూడా వాడుక పదాలు కాకుండా.. కొత్త పదాలు కూర్చారు. దీంతో ప్రభాస్ ఫాన్స్ ఆందోళనలో పడ్డారు.

prabhas fans worried about aadipurush result..!!

మరోవైపు ఆదిపురుష్ దర్శకుని కెరీర్ కూడా ఈ సినిమాపై ఆధారపడి ఉంది. ఆదిపురుష్ మూవీ హిట్టైతే మాత్రమే ఓం రౌత్ కు ఆఫర్లు ఇవ్వాలని పలువురు టాలీవుడ్ హీరోలు భావిస్తున్నారని తెలుస్తోంది. ఈ సినిమాను టి సిరీస్ సంస్థ 500 కోట్ల భారీ బడ్జెట్ తో నిర్మించింది. ఈ ఏడాది జనవరిలోనే ఈ సినిమా రిలీజ్ అవ్వాల్సి ఉండగా కొన్ని కారణాల వల్ల వాయిదా వేశారు. ఇక ఫైనల్ గా జూన్ 16న ప్రేక్షకుల ముందుకి రానుంది.

Also read:  “కోట్లు పెట్టి సినిమా తీస్తే సరిపోదు… ఇవి కూడా చూసుకోలేరా..?” అంటూ… “ఆదిపురుష్” డైరెక్టర్‌పై కామెంట్స్ ఏం జరిగిందంటే..?