టికెట్ల పెరుగుదల ఈ సినిమాలకు నష్టమేనా.. మరి సర్కారు వారి పాట పరిస్థితి ఏంటో..!!

టికెట్ల పెరుగుదల ఈ సినిమాలకు నష్టమేనా.. మరి సర్కారు వారి పాట పరిస్థితి ఏంటో..!!

by Sunku Sravan

Ads

కరోనా కాలంలో సినిమాలు థియేటర్లకి రాకుండా దాదాపుగా రెండు సంవత్సరాలు ఉన్నాయి. ఇప్పుడిప్పుడే కరోణ పూర్తిగా తగ్గి సినిమాలు వరుసగా థియేటర్లలోకి వస్తున్నాయి.

Video Advertisement

పుష్ప, కే జి ఎఫ్ 2, ఆర్ఆర్ ఆర్ మూవీస్ పాన్ ఇండియా లెవెల్ లో రిలీజ్ అయి బ్లాక్ బాస్టర్ హిట్ కొట్టాయి. ఈ తరుణంలో ఈ సినిమాలతో పాటుగా థియేటర్లోకి వచ్చిన స్టార్ హీరోల సినిమాలు భీమ్లానాయక్ యావరేజ్, రాధేశ్యాం ఆచార్య సినిమాలు అట్టర్ ఫ్లాప్ అయ్యాయి.

దీనికి ప్రధాన కారణం టికెట్ల రేట్లు పెరగడమేనా. తెలుగు రాష్ట్రాల్లో టికెట్ల రేట్లు భారీగా పెంచారు . దీంతో పాన్ ఇండియా లెవెల్ లో రిలీజ్ అయ్యే సినిమాలకు ఎక్కువ బడ్జెట్ పెట్టి తీస్తున్నారు. ఇవి ఫ్లాప్ టాక్ తెచ్చుకోవడంతో కనీసం సినిమా చూడడానికి వెళ్లేవారు కూడా టికెట్ల రేట్లు ఎక్కువగా ఉండడంతో థియేటర్ల వైపు వెళ్లడం లేదు. ఆచార్య మూవీ నిర్మాతలు అదనంగా 50 కోట్ల రూపాయలు వడ్డీలు కట్టాము అంటూ టిక్కెట్ల రేట్లు పెంచడానికి ప్రభుత్వం రిక్వెస్ట్ చేశారు.

దానికి ప్రభుత్వం కూడా ఓకే అన్నది. కానీ జనాలు మాత్రం అంతంత రేట్లు పెట్టి సినిమా చూడడానికి ఇంట్రెస్ట్ చూపించడం లేదని చెప్పవచ్చు. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో మల్టీప్లెక్స్ ల్లో టికెట్ రేటు 413 రూపాయల నుండి 354 రూపాయల వరకు ఉన్నది. జిఎస్టి వంటివి అన్ని కలిపితే అదనంగా 50 రూపాయలు ఎక్కువ అవుతోంది. అంటే ఫ్యామిలీతో సినిమాకు వెళ్లాలనుకుంటే 1500 రూపాయల వరకు అవుతోంది. సింగిల్ స్క్రీన్లలో అయితే వెయ్యి రూపాయల వరకు పెట్టాలి.

ఈ అమౌంట్ మధ్యతరగతి కుటుంబాలకు భారంగా చెప్పవచ్చు. అలాంటి వారు సినిమా ప్లాప్ టాక్ అని తెలిస్తే చూడాలనిపించినా టికెట్ రేట్లు చూసి థియేటర్ల వైపు కూడా వెళ్ళలేకపోతున్నారు. దీంతో సినిమా అట్టర్ ఫ్లాప్ అవుతుంది. ఇదే తప్పును సర్కారు వారి పాట కూడా కంటిన్యూ చేస్తే మాత్రం రాధేశ్యాం మరియు ఆచార్య సినిమా లాగా ప్రమాదంలో పడే అవకాశం ఉందని కొంతమంది విశ్లేషకులు చెబుతున్నారు. మరి మూవీ యూనిట్ రేట్ల విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.


End of Article

You may also like