టిల్లు స్క్వేర్ Vs ఫ్యామిలీ స్టార్..! ఆడియన్స్ ఓటు దేనికి అంటే..?

టిల్లు స్క్వేర్ Vs ఫ్యామిలీ స్టార్..! ఆడియన్స్ ఓటు దేనికి అంటే..?

by Mohana Priya

Ads

ఎన్నో భారీ అంచనాల మధ్య విజయ్ దేవరకొండ హీరోగా నటించిన ఫ్యామిలీ స్టార్ సినిమా నిన్న విడుదల అయ్యింది. కొంత మంది సినిమా బాగుంది అంటూ ఉంటే, కొంత మంది మాత్రం రొటీన్ కథ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. కొంత మందికి ఈ సినిమాలో ఉన్న కొన్ని సీన్స్ అభ్యంతరకరంగా అనిపించాయి. దాంతో వాటి మీద కామెంట్స్ చేస్తున్నారు. ఈ సినిమాని తెలుగుతో పాటు, తమిళ భాషలో కూడా విడుదల చేశారు. తమిళంలో కూడా విజయ్ దేవరకొండకు చాలా మంది అభిమానులు ఉన్నారు. కాబట్టి ఈ సినిమాకి తమిళ్ లో కూడా మంచి క్రేజ్ ఉంది.

Video Advertisement

tillu square vs family star audience preference

అయితే, సినిమాకి ఇప్పుడు మిక్స్డ్ గా టాక్ వస్తోంది. మరొక పక్క, గతవారం సిద్దు జొన్నలగడ్డ హీరోగా నటించిన టిల్లు స్క్వేర్ సినిమా విడుదల అయ్యింది. రెండు సంవత్సరాల క్రితం వచ్చిన డీజే టిల్లు సినిమాకి సీక్వెల్ గా ఈ సినిమా రూపొందింది. ఈ సినిమా విడుదల అయిన మొదటి రోజు నుంచే పాజిటివ్ టాక్ రాబట్టుకుంది. ప్రస్తుతం టిల్లు స్క్వేర్, ఫ్యామిలీ స్టార్ సినిమాలకి మధ్య పోటీ నడుస్తోంది. ఏ సినిమాకి ఎక్కువ కలెక్షన్స్ వస్తాయి అనే ఆసక్తి నెలకొంది. అయితే ఫ్యామిలీ స్టార్ నిన్న డివైడ్ టాక్ ఉన్నా కూడా కలెక్షన్స్ పరంగా బాగానే వచ్చాయి. కానీ తర్వాత వీక్స్ లో ఎలా పెర్ఫార్మ్ చేస్తుంది అనేది ఇప్పుడు తెలుస్తుంది.

tillu square movie review

మరొక పక్క, టిల్లు స్క్వేర్ సినిమాకి కలెక్షన్లు పెరుగుతూనే ఉన్నాయి. థియేటర్స్ కూడా యాడ్ అయ్యాయి. రెండు సినిమాల్లోనూ అభ్యంతరకరమైన సన్నివేశాలు ఉన్నాయి. టిల్లు స్క్వేర్ సినిమాలో లవ్ సీన్స్ కొంచెం ఎక్కువగా ఉన్నాయి అంటూ కామెంట్స్ వచ్చాయి. ఫ్యామిలీ స్టార్ సినిమాలో అలాంటివి తక్కువగా ఉన్నా కూడా, కొన్ని డైలాగ్స్, కొన్ని సీన్స్ రాసిన విధానం మీద కామెంట్స్ వచ్చాయి. అయితే రెండిట్లో ఇలాంటి సమస్యలు ఉన్నా కూడా ఎక్కువ మంది టిల్లు స్క్వేర్ సినిమాకి వెళ్తున్నారు. రెండు సినిమాలని పోల్చి చూస్తే ఎంటర్టైన్మెంట్ పరంగా టిల్లు స్క్వేర్ ముందు ఉంది అని అంటున్నారు. ప్రస్తుతం వీకెండ్ వస్తోంది కాబట్టి ఫ్యామిలీ స్టార్ కి కూడా ఆడియన్స్ ఎక్కువగా వచ్చే అవకాశాలు ఉన్నాయి.

ALSO READ : ఈ 12 మంది ఇప్పుడు స్టార్స్…కానీ ఒకప్పుడు సైడ్ క్యారెక్టర్స్ చేసారని మీకు తెలుసా.?


End of Article

You may also like