తల్లిదండ్రులే పిల్లలను చిన్నప్పటి నుంచి మార్చుకుంటూ రావాలి. అప్పుడే పిల్లలు పెద్దవాళ్ళు అయిన తర్వాత మంచి అలవాట్లను అలవాటు చేసుకుంటూ ఉంటారు. లేదంటే పిల్లలు పెద్దయిన తర్వాత ఇబ్బంది పడుతూ ఉంటారు. అయితే ఒక్కోసారి పిల్లలు కొన్నిటిని వదిలి పెట్టేయాలని డిసైడ్ అయి పోతూ ఉంటారు.

Video Advertisement

నిజానికి ఇది కనుక వారికి అలవాటు అయితే పెద్దయిన తర్వాత కూడా సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. అందుకనే తల్లిదండ్రులు ఈ విషయం పట్ల బాధ్యతగా ఉండాలి. వాళ్లు కనుక విడిచి పెట్టాలని అనుకుంటే తల్లిదండ్రులు ఇలా చెప్తే పిల్లల భవిష్యత్తు బాగుంటుంది.

#1. నువ్వు ట్రై చేస్తున్నందుకు నాకు గర్వంగా ఉంది:

మీ పిల్లలు గెలవలేక మధ్యలోనే విడిచి పెడుతూ ఉన్నట్లయితే ‘నువ్వు ట్రై చేస్తున్నందుకు నాకు గర్వంగా ఉంది’ అని చెప్పండి. దీనితో వాళ్ళు మరోసారి ట్రై చేయడానికి చూస్తారు. విడిచి పెట్టిన దాన్ని మళ్ళీ ప్రయత్నం చేయాలని వారికి అనిపిస్తుంది.

#2. నీ ఆలోచనకి నాకు గర్వంగా అనిపిస్తోంది.. నీకు తోడుగా ఉంటాను:

విడిచిపెట్టాలని మీ పిలల్లు నిర్ణయం తీసుకుంటే.. నీ ఆలోచనకి నాకు గర్వంగా అనిపిస్తోంది.. నీకు తోడుగా ఉంటాను అని మీరు కాస్త పిల్లలకి దన్ను ఇవ్వండి అప్పుడు వాళ్ళు కొత్త విషయాలను నేర్చుకోవడానికి తెలుసుకోవడానికి అవుతుంది.

#3. మీరు ఆనందించిన వాటి కోసం చెప్పండి:

మీ పిల్లలు విడిచి పెడుతున్నప్పుడు.. మొదలుపెట్టినప్పటి నుండి విడిచి పెట్టిన వరకు మీరు ఏ విషయంలో గర్వ పడ్డారు ఏ విషయంలో ఆనందపడ్డారు అని వివరించి చెప్పండి. దీంతో వారు ఆ ఓటమి నుంచి బయట పడి మరొకసారి ప్రయత్నం చేసినప్పుడు గెలవడానికి అవుతుంది.

#4. దీని నుండి నేర్చుకో:

ఎప్పుడైనా మీ పిల్లలు మధ్యలో దేనినైనా విడిచి పెడితే దీని నుండి నేర్చుకోమని చెప్పండి.

#5. ఏం పరవాలేదు:

నీవు మధ్యలో విడిచిపెట్టవు అయినప్పటికీ ఏమీ పర్వాలేదు అని వాళ్ళని ప్రోత్సహించండి. అప్పుడు మళ్ళీ వాళ్ళు నేర్చుకోవడానికి అవుతుంది.

#6.మరిన్ని అవకాశాలు వస్తాయి:

ఈసారి విడిచి పెడుతున్నందుకు బాధపడకు ఇంకా ఎన్నో అవకాశాలు ఉంటాయి. వాటిని నువ్వు ప్రయత్నం చేయాలి అని చెప్పండి. ఇలా చెప్పడం వల్ల పిల్లలు మంచి విషయాలు నేర్చుకుంటారు. గెలవడానికి అవుతుంది.