అనాథను చెప్పి ముగ్గుర్ని పెళ్లి చేసుకొని లక్షల్లో దోచేసింది…తిరుపతి మాయలేడి గురించి నమ్మలేని నిజాలు.!

అనాథను చెప్పి ముగ్గుర్ని పెళ్లి చేసుకొని లక్షల్లో దోచేసింది…తిరుపతి మాయలేడి గురించి నమ్మలేని నిజాలు.!

by Mohana Priya

Ads

ఒక మహిళ ప్రేమ పేరుతో నమ్మించి మోసం చేసిన ఒక ఘటన చిత్తూరు జిల్లా, తిరుపతిలో చర్చలకు దారి తీసింది. వివరాల్లోకి వెళితే సమయం కథనం ప్రకారం తెలంగాణలోని కొత్తగూడెంకి చెందిన వినయ్ కి 2018 లో సుహాసినితో పరిచయం అయ్యింది. సుహాసిని తాను అనాధని అని, తాను వినయ్ ని ప్రేమిస్తున్నాను అని చెప్పింది. 2019 లో వారిద్దరూ పెళ్లి చేసుకున్నారు. పెళ్లి చేసుకున్న కొన్ని రోజుల తర్వాత సుహాసిని ప్రవర్తన మారిపోయింది.

Video Advertisement

Women frauds two men

తనకి తెలియకుండా తన బంధువుల నుండి డబ్బులు తీసుకోవడాన్ని వినయ్ గమనించాడు. పెళ్ళయిన కొన్ని రోజులకే మొదటి భర్త వెంకటేశ్వర్లు, అలాగే ఆమె ఇద్దరు పిల్లలను ఇంటికి పిలిచి, బంధువులుగా పరిచయం చేసింది. కొద్ది రోజులు గడిచాక తన బంధువుల దగ్గర నుంచి తీసుకువచ్చిన 10 లక్షలతో పాటు, ఇంట్లో ఉన్న దాదాపు 5 లక్షల విలువ చేసే బంగారంతో రెండు సంవత్సరాల క్రితమే ఇంటి నుంచి పారిపోయింది అని వినయ్ చెప్పాడు.

Women frauds two men

దీంతో తాను మోసపోయాను అనే విషయం గ్రహించి, పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు ప్రయత్నించినా, వారు పట్టించుకోలేదు అని అన్నాడు. అయితే తనను మోసం చేసినట్లుగానే ఆమె ఇంకా కొంత మందిని కూడా మోసం చేస్తోంది అని పేర్కొన్నాడు. తిరుపతిలో మూడో పెళ్లి చేసుకొని మోసం చేసిన విషయం వెలుగులోకి రావడంతో తాను మీడియా ముందుకు వచ్చినట్టు వినయ్ తెలిపాడు.

Women frauds two men

సుహాసిని తన మొదటి భర్త వెంకటేశ్వర్లుతో కలిసి ఈ మోసాలకు పాల్పడుతోంది అని, ఆమెను వెంటనే అదుపులోకి తీసుకోవాలి అని వినయ్ పోలీసులను కోరాడు. తిరుమలలోని అలిపిరి ఎస్ఐ పరమేష్ నాయక్ తెలిపిన వివరాల ప్రకారం, చిత్తూరు జిల్లాలోని విజయపురం మండలానికి చెందిన 29 సంవత్సరాల సునీల్ కుమార్ అనే యువకుడు 5 సంవత్సరాలుగా మార్కెటింగ్ లో ఉద్యోగం చేస్తున్నాడు.

Couple married in a train

సునీల్ కుమార్ తిరుపతి, సత్యనారాయణపురంలో నివాసం ఉంటున్నాడు. తిరుపతిలోని ఒక ఫైనాన్స్ కంపెనీలో పనిచేసే 35 సంవత్సరాల సుహాసినితో ఆ సునీల్ కుమార్ కి ఏర్పడిన పరిచయం ప్రేమగా మారింది. సుహాసిని అనాధ అని చెప్పడంతో సునీల్ కుమార్ జాలి చూపించి, ఆ తర్వాత తన కుటుంబ సభ్యులను ఒప్పించి, గత సంవత్సరం డిసెంబర్ లో పెళ్లి చేసుకున్నాడు. ఆ సమయంలో సుహాసినికి 8 తులాల బంగారు నగలు పెట్టారు.

Questions to ask before marriage

సుహాసిని, తనను చిన్నప్పటినుంచి ఆదరించిన వారికి ఆరోగ్యం సరిగా లేదు అని, పెళ్ళికి ముందు తాను కొన్ని అప్పులు చేశాను అంటూ సునీల్ కుమార్ నుంచి వివిధ రూపాల్లో 4 లక్షల మొత్తం తీసుకుంది. అది మాత్రమే కాకుండా తన తండ్రి నుండి మరొక 2 లక్షల రూపాయలు తీసుకుందని తెలియడంతో, సునీల్ కుమార్ ఈ నెల 7వ తేదీన ఆమెను నిలదీశాడు. దాంతో ఇద్దరికీ గొడవ అయ్యింది.

Women frauds two men

ఆ రోజు రాత్రి డబ్బు విషయమై సునీల్ కుమార్ తో గొడవ పడ్డ సుహాసిని, మరుసటి రోజు కనిపించకుండా వెళ్లిపోయింది. సుహాసిని అడ్రస్ కోసం ప్రయత్నించే క్రమంలో ఆమె ఆధార్ కార్డు లభించింది. దాని ఆధారంగా వివరాలు సేకరించడానికి ప్రయత్నించగా, నెల్లూరు జిల్లాలోని కోనేటిరాజుపాలెంకి చెందిన వెంకటేశ్వర్లుతో ఆమెకి పెళ్లి అయ్యి, ఇద్దరు కుమార్తెలు ఉన్నట్లు తెలిసింది.

Women frauds two men

ఈ లోపు సుహాసిని ఆ సునీల్ కుమార్ కి ఫోన్ చేసి తాను హైదరాబాద్ లో ఉన్నట్టు, త్వరలోనే తన డబ్బులు తిరిగి ఇచ్చేస్తాను అని చెప్పింది. ఒకవేళ పోలీసులను ఆశ్రయిస్తే ఇబ్బంది పెడతాను అని హెచ్చరించింది. అంతే కాకుండా వినయ్ ఫోటోలను సునీల్ కుమార్ కి పంపింది. దీంతో సునీల్ కుమార్ మోసపోయినట్లు గ్రహించి పోలీసులను ఆశ్రయించాడు. పోలీసులు కాల్ డీటెయిల్స్ పరిశీలించడంతో పాటు, సుహాసిని హైదరాబాద్ లో ఉన్న అడ్రస్ ట్రేస్ చేయడానికి ప్రయత్నిస్తున్నారు


End of Article

You may also like