Ads
ఇటీవల కాలం లో బాలయ్య బాబు కు సరైన హిట్ పడలేదు. గౌతమి పుత్ర శాతకర్ణి సినిమా తరువాత.. ఏ సినిమా అంత గా ఆడలేదు. రూలర్ కూడా అంచనాలను అందుకోలేకపోయింది. ఈ క్రమం లో బాలయ్య ఫాన్స్ బోయపాటి పైనే ఆశలు పెట్టుకున్నారు.
Video Advertisement
ఇప్పటి వరకు బాలయ్య, బోయపాటి కాంబో లో వచ్చిన సింహ, లెజెండ్.. సినిమా లు సూపర్ హిట్ అవడం తో “అఖండ” సినిమా కూడా సూపర్ హిట్ అవుతుందని ఫాన్స్ ఆశలు పెట్టుకున్నారు. అయితే.. సినిమా ఇండస్ట్రీ లో సెంటిమెంట్ లు ఎక్కువ గా ఉంటాయన్న సంగతి తెలిసిందే. బాలయ్య బాబు కు “అ” అక్షరం తో మొదలైన సినిమాలు వర్క్ ఔట్ కాలేదు. ఇదివరకు ఈ లెటర్ తో మొదలైన సినిమాలు చాలా వరకు ప్లాప్ అయ్యాయి.
బాలయ్య హీరో గా నటించిన అక్బర్ సలీం అనార్కలి, అశ్వ మేధం,అధినాయకుడు, అల్లరి కృష్ణయ్య, అల్లరి పిడుగు, అశోక చక్రవర్తి, అనురాగ దేవత సినిమాలు ప్లాప్ అయ్యాయి. అన్నాదమ్ముల అనుబంధం, అనసూయమ్మ గారి అల్లుడు సినిమాలు మాత్రం హిట్ అయ్యాయి. “అపూర్వ సహోదరులు” అనే సినిమా మాత్రం జస్ట్ యావరేజ్ గా నిలిచింది.
ఈ క్రమం లో బాలయ్య బాబు ఫాన్స్ కి కొత్త టెన్షన్ మొదలైంది. లేటెస్ట్ గా రాబొయ్యే “అఖండ” సినిమా కూడా “అ” అక్షరం తోనే మొదలవడం తో.. ఫాన్స్ కంగారు పడుతున్నారు. ఈ సినిమా టైటిల్ ను మారిస్తే బాగుంటుందని అభిప్రాయపడుతున్నారు. మరికొందరేమో.. బాలయ్య, బోయపాటి కాంబో హిట్ అవుతుందని అభిప్రాయపడుతున్నారు. ఏమి జరుగుతుందో చూడాలి మరి.
End of Article