Ads
సీనియర్ నటుడు నరేష్ మూడవ భార్య రమ్య రఘుపతి కేసు విషయమై టాలీవుడ్ లో చర్చలు జరుగుతున్న సంగతి తెలిసిందే. నటుడు నరేష్ భార్య రమ్య పలువురి వద్ద 20 శాతం ఒప్పందం కింద నగదు తీసుకుందని గత కొన్ని రోజులుగా వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే.
Video Advertisement
అయితే.. ఈ విషయమై బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేసినా.. ఇప్పటివరకు ఎఫ్ ఐ ఆర్ నమోదు కాలేదు. మరో వైపు ఇది సివిల్ వివాదం కావడంతో పోలీసులు లీగల్ ఒపీనియన్ తీసుకోవాలని భావిస్తున్నారు.
ఇప్పటికే ఐదుగురు బాధితుల వద్ద రమ్య రఘుపతి దాదాపు నలభై లక్షల రూపాయలను తీసుకున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. ఈ విషయమై పోలీసులు నేడు రమ్య రఘుపతిని విచారణ చేయనున్నారు. రమ్య రఘుపతి తమ వద్ద డబ్బు తీసుకుని మోసం చేశారు అంటూ బాధితులు పోలీసులకు మొత్తుకుంటున్నారు. కాగా, ఈ బాధితులలో ఇద్దరు మహిళలు, ముగ్గురు పురుషులు ఉన్నట్లు తెలుస్తోంది.
ఇరవై శాతం వడ్డీ ఇస్తానంటూ డబ్బు తీసుకున్నారని.. కానీ, ఇవ్వాల్సిన మొత్తంలో సగమే చెల్లించారని పేర్కొన్నారు. కాగా.. మిగతా డబ్బు చెల్లించడానికి చెక్ లు ఇచ్చారని, కానీ ఆ చెక్ లు బౌన్స్ అయ్యాయని సదరు బాధితులు పేర్కొన్నారు. అయితే.. ఈ కేసులో లీగల్ సాయం తీసుకుంటున్నామని పోలీసులు పేర్కొన్నారు. ఆమె ఈ డబ్బుని నరేష్ పేరు చెప్పి తీసుకున్నారా..? లేక స్వంతంగానే తీసుకున్నారా అన్న కోణంలో కూడా విచారణ జరగాల్సి ఉందన్నారు.
End of Article