మన సెలబ్రిటీలకి కేవలం ఒక చోట మాత్రమే కాకుండా ఎన్నో చోట్ల ప్రాపర్టీలు ఉంటాయి. అలా కొంత మంది సెలబ్రిటీలు ముంబైలో కూడా ఒక ఇంటిని ఖరీదు చేశారు. వారిలో మన తెలుగు ఇండస్ట్రీకి చెందిన సెలబ్రిటీలు కూడా ఉన్నారు. జీక్యూ (GQ) ఇండియా కథనం ప్రకారం అలా ముంబైలో ఇల్లు ఖరీదు చేసిన మన తెలుగు ఇండస్ట్రీకి చెందిన సెలబ్రెటీలు ఎవరో ఇప్పుడు చూద్దాం.
Video Advertisement
#1 కాజల్ అగర్వాల్
కాజల్ అగర్వాల్ ఎన్నో సంవత్సరాల నుండి ముంబై లోనే ఉంటున్నారు. అలాగే అక్కడ ఒక ఇల్లు కూడా ఖరీదు చేశారు.
#2 తమన్నా భాటియా
తమన్నా భాటియాకి కూడా ముంబైలో సొంత ఇల్లు ఉంది. ఏషియన్ పెయింట్స్ బ్యూటిఫుల్ హోమ్స్ ప్రోగ్రాంలో తమన్నా తన ఇంటిని చూపించారు.
#3 పూజా హెగ్డే
పూజా హెగ్డేకి కూడా ముంబైలో సొంత ఇల్లు ఉంది. ముంబైలో ఒక అపార్ట్మెంట్ లో తన కుటుంబంతో కలిసి ఉంటారు పూజా హెగ్డే.
#4 అల్లు అర్జున్
అల్లు అర్జున్ కూడా ముంబైలో ఒక ఇల్లు కొనుగోలు చేశారట. ఆరేళ్ల క్రితం ఒక 2 బెడ్ రూమ్ ఫ్లాట్ కొన్నారట అల్లు అర్జున్.
#5 రష్మిక మందన
రష్మిక మందన ఈ సంవత్సరం హిందీ ఇండస్ట్రీలో కూడా అడుగు పెట్టబోతున్నారు. ఆల్రెడీ రెండు హిందీ సినిమాల్లో నటిస్తున్నారు రష్మిక. అలాగే తెలుగులో కూడా పుష్ప సినిమాలో, అలాగే ఆడవాళ్ళూ మీకు జోహార్లు సినిమాలో నటిస్తున్నారు. అయితే ఇటీవల రష్మిక కూడా ముంబైలో ఒక ఇల్లు కొనుగోలు చేశారట.
#6 రామ్ చరణ్
పెళ్లయిన కొన్ని సంవత్సరాలకి రామ్ చరణ్ ముంబైలో ఒక ఇల్లు కొనుగోలు చేశారట. అది కూడా బాంద్రాలో బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ ఇంటికి దగ్గరగా ఉండే చోట రామ్ చరణ్ ఇల్లు కొనుగోలు చేశారని సమాచారం.