Ads
సినిమా ఇండస్ట్రీ లో సెలెబ్రిటీల ఒరిజినల్ నేమ్స్ తో పాటు వారికి అభిమానులు పెట్టుకున్న పేర్లు కూడా బాగానే పాపులర్ అవుతూ ఉంటాయి. కొన్ని సార్లు ఒరిజినల్ పేర్లకంటే కూడా ఇవే ఎక్కువ పాపులర్ అవుతాయి. కొంతమందికి వారు నటించిన, లేదా పనిచేసిన సినిమాలు మంచి గుర్తింపు తెచ్చిపెట్టడమే కాకుండా.. ఆ సినిమా పేర్లే వారి పేరు పక్కన చేరిపోతాయి.
Video Advertisement
వారిని గుర్తించినప్పుడల్లా.. ఆటోమేటిక్ గా మనకి వారు నటించిన సినిమా కూడా గుర్తొచ్చేస్తూ ఉంటుంది. అంత గా ప్రభావం చూపించగలిగారు కాబట్టే.. ఆ సినిమా పేర్లు వారి ఇంటి పేర్లు గా మారిపోయాయి. అలా టాలీవుడ్ లో సినిమా పేర్లనే ఇంటిపేర్లు గా మార్చుకున్న సెలెబ్రిటీలు ఎవరో మనం ఇప్పుడు చూద్దాం.
#వెన్నెల కిషోర్:
వెన్నెల కిషోర్ ఇటీవల చాలా సినిమాలలో నటిస్తూ ఆకట్టుకుంటున్నారు. ఆయన “వెన్నెల”సినిమా లో సాఫ్ట్ వేర్ ఇంజనీర్ పాత్రలో కనిపించి అదరగొట్టారు. అప్పటినుంచి ఆ సినిమా పేరు తో కలిపి వెన్నెల కిషోర్ అని పిలవడం మొదలుపెట్టారు.
#అల్లరి నరేష్
ఇవివి సత్యనారాయణ గారి కొడుకు గా నరేష్ గారు ఇండస్ట్రీ కి పరిచయం అయినప్పటికి.. ఆయన నటించిన మొదటి చిత్రం అల్లరి సినిమా పేరే ఆయన పేరు పక్కన చేరిపోయింది. అప్పట్లో మరో నరేష్ కూడా హీరో గా ఉండేవారు. దీనితో.. ఈయనను అల్లరి నరేష్ అని పిలవడం మొదలుపెట్టారు.
#షావుకారు జానకి:
పాత తరం నటి షావుకారు సినిమా తో తెలుగు తెరకు పరిచయమయ్యారు. ఆమె సుబ్బులు అనే పాత్రలో నటించి మెప్పించారు. ఈ సినిమా ఆమెకు మంచి పేరు తేవడం తో.. ఆమెను షావుకారు జానకి అని పిలిచేస్తున్నారు.
#చిత్రం శ్రీను
ఈయన అసలు పేరు శ్రీనివాసులు. చిత్రం సినిమా తో తెలుగు తెరకు పరిచయం అయి ఆకట్టుకుంటున్నారు. అప్పటినుంచి ఈయనను చిత్రం శీను అని పిలిచేస్తున్నారు.
#దిల్ రాజు
టాలీవుడ్ బడా నిర్మాత దిల్ రాజు “దిల్” సినిమా కి ప్రొడ్యూసర్. ఈయన ఈ సినిమా తో మంచి పేరు తెచ్చుకున్నారు. అప్పటినుంచి ఈయనను దిల్ రాజు అని పిలుస్తూ వస్తున్నారు.
#శుభలేఖ సుధాకర్:
“శుభలేఖ” సినిమా మెగాస్టార్ చిరంజీవి. సుధాకర్ ఈ సినిమా తో తెలుగు తెర కు పరిచయం అయ్యారు. అప్పటినుంచి ఆయన కు శుభలేఖ సుధాకర్ అన్న పేరు ఫిక్స్ అయిపొయింది.
#సత్యం రాజేష్:
ఈయన పేరు రాజేష్ బాబు. ‘ సత్యం ‘ సినిమా ఈయనకు గుర్తింపు తీసుకురావడం తో ఈయన్ను సత్యం రాజేష్ అని పిలుస్తున్నారు.
#సిరి వెన్నెల సీతా రామశాస్త్రి:
“సిరివెన్నెల” సినిమా రైటర్ గా ఆయనకు మంచి పేరు తెచ్చిపెట్టింది. ఇండస్ట్రీ లో ఆయన పేరు ముందు సిరివెన్నెల కూడా చేరిపోయింది.
#ఆహుతి ప్రసాద్:
ప్రముఖ నటుడు ఆహుతి ప్రసాద్ కు కూడా ఆ పేరు ఆహుతి మూవీ నుంచే వచ్చింది. ప్రసాద్ అంటే వెంటనే గుర్తురాదేమో కానీ..ఆహుతి ప్రసాద్ అంటే ఎవరైనా యిట్టె చెప్పేస్తారు.
#బొమ్మరిల్లు భాస్కర్:
బొమ్మరిల్లు సినిమా సిద్ధూ కి, జెనీలియా కి మంచి పేరు తెచ్చిపెట్టింది. డైరెక్టర్ భాస్కర్ కి అయితే ఏకం గా ఇంటిపేరు తెచ్చిపెట్టేసింది. ఈ సినిమా తరువాత నుంచి ఆయనను బొమ్మరిల్లు భాస్కర్ అని పిలుచుకుంటూ వస్తున్నాం.
End of Article