Ads
మన టాలీవుడ్ డైరెక్టర్లలో ఒక్కొక్కరికి ఒక్క్కొక్క స్పెషలిటీ ఉంది. కొందరు మాస్, కొందరు లవ్ మూవీస్, కొందరు ఫాంటసీ మూవీస్, కొందరు ఊర మాస్ మూవీస్, కొందరు క్లాసీ లవ్ మూవీస్… ఇలా ఒక్కో జోనర్ లో ఒక్కక్కరు ఇరగదీస్తారు.
Video Advertisement
అయితే ఒక్కో డైరెక్టర్ సినిమాలన్నిటిలోను ఓ కామన్ పాయింట్ ఉంటుంది. అదేంటో మనం ఇప్పుడు చూసేద్దాం..
1. రాజమౌళి:
ముందుగా దర్శక ధీరుడు రాజమౌళి ఎక్కువ గా ఫాంటసీ మూవీస్ తీస్తూ ఉంటారు. మిష్టర్ పర్ఫెక్షనిస్ట్ కి మారుపేరు ఏదైనా ఉంటె అది రాజమౌళి. అందుకే ఈయన్ని జక్కన్న అని పిలుచుకుంటాం. ప్రతి సినిమా ను ఎంతో పర్ఫెక్ట్ గా చెక్కుతారు. ఈయన అన్ని సినిమాల్లోనూ ఇంటర్వెల్ లో ఊహించని షాక్ ఇచ్చేస్తాడు. రాబోయే పార్ట్ పై విపరీతమైన క్యూరియోసిటీని పెంచేస్తాడు. ప్రతి సినిమా పై స్పెషల్ ఫోకస్ పెడతాడు కాబట్టే.. ఆయన సినిమా అంటే పక్కా హిట్ అవుతుంది.
2. బోయపాటి శ్రీను:
పక్కా మాస్ సినిమాలు తీయడం లో బోయపాటి దిట్ట. వెండితెరకి రక్తం తో తడిపేస్తారు.. హీరోయిన్ల కష్టాలు, ఫ్యాక్షన్ డ్రామాలు, ఓ బడా విలన్ నుంచి హీరోయిన్ ను రక్షించుకునే హీరో.. ఈయన సినిమాలన్నీ ఈ పాయింట్ ల చుట్టూనే తిరుగుతుంటాయి.
3. కొరటాల శివ:
ఈయన నాలుగు సినిమాలే డైరెక్ట్ చేసినా.. అవి మంచి టాక్ తెచ్చుకున్నాయి. ఈ సినిమాలలో హీరో ఒకేలా ఉండడం కామన్ పాయింట్. ఈయన సినిమాలలో హీరో లు ఎక్కువ గా మాట్లాడారు.. ఏమి చెప్పాలనుకున్నా.. కామ్ గా అది చేసి చూపించేస్తారు. జనతా గ్యారేజ్, మిర్చి, భరత్ అనే నేను, శ్రీమంతుడు.. ఈ సినిమాల్లో హీరో క్యారెక్టర్ ఇంచుమించు ఒకలానే ఉంటుంది. ఈయన అన్ని సినిమాల్లోనూ ఎదో ఒక సోషల్ కాజ్ పై హీరో పోరాడుతూ ఉంటాడు.
4. వివి వినాయక్:
వినాయక్ సినిమా అంటే ఫ్లాష్ బ్యాక్ లు ఉంటాయి.. హీరో లు డ్యూయల్ రోల్స్ వేస్తూ ఉంటారు. సీరియస్ గా ఉండే విలన్స్ కు జోకులు పేలుస్తారు.
5. సుకుమార్:
ఈయన లెక్కలు సినిమాల్లో కూడా ఉంటాయి. సినిమాలు కొంచం క్రిటికల్ గా ఉన్నట్లు అనిపిస్తాయి. ఎంటర్టైన్మెంట్ మాత్రం పక్కా ఉంటుంది. అలానే ఐటెం సాంగ్స్ కూడా అదిరిపోతాయ్.. ఈయన సినిమాల్లో హీరోలు డిజేబుల్ గానో లేక ఈగోయిస్టు గానో కనిపిస్తూ ఉంటారు.
6. గౌతమ్ మీనన్:
లవ్లీ లవ్ స్టోరీస్ తెరకెక్కించడం లో గౌతమ్ మీనన్ స్టయిల్ వేరు. తమిళ దర్శకుడు అయినప్పటికీ.. తెలుగు లో కూడా సినిమాలు చేసారు. ఈయన సినిమాల్లో హీరోయిన్లు ఎక్కువ గా ఇండివిడ్యుయల్ గా ఉంటూ ఉంటారు.
7. శ్రీనువైట్ల:
శ్రీను వైట్ల అంటే ఒకప్పుడు ఓ రేంజ్ లో సినిమాలు ఉండేవి. ప్రస్తుతం కొంచం స్లో అయినట్లు కనిపిస్తున్న.. శ్రీను వైట్ల సినిమా అంటే పక్కా హిట్ అనే టాక్ ఉండేది. ఈయన సినిమాలలో కామెడీ ఉంటుంది కానీ, అది అంత గా క్లిక్ అయ్యేలా ఉండదు. డిఫరెంట్ గా సినిమాల పేర్లు పెడతారు. సినిమాల్లో క్యారెక్టర్ ల పేర్లు కూడా చాలా కొత్తగా పెడతారు.
8. త్రివిక్రమ్:
త్రివిక్రమ్ గురించి చెప్పక్కర్లేదు. ఈయన మాటల మాయగాడు. ఈయన ప్రతి సినిమాలోనూ మాటలు మేజిక్ చేస్తాయి..
9. పూరి జగన్నాధ్:
పూరి సినిమాలలో హీరో చాలా స్ట్రాంగ్ గా ఉంటాడు. ఏ క్యారక్టర్ లో అయినా ఎలాంటి హీరో ని అయినా ఒదిగిపోయేలా చేయించడం పూరి స్పెషాలిటీ. పూరి సినిమాలలో సమాజం పై కోపం కనిపిస్తుంది.
End of Article