Ads
“ఎగిరే పావురమా” చిత్రం లో అమాయకమైన చిరునవ్వుతో మనలని బాగా ఆకట్టుకున్న ఈ చలాకి కళ్ళ చిన్నది గుర్తుందా..? లైలా.. ఈ పేరు లానే ఆమె కూడా ఎంతో అందం గా ఉంటుంది. ఒకప్పుడు టాలీవుడ్ అగ్రతారల జాబితా లో ఆమె కూడా ఉండేది. అంతలా తెలుగు వారికి దగ్గరైన ఈ చిన్నది.. పెళ్లి తరువాత మాత్రం కుటుంబానికే పరిమితమైంది. మరి ఈమె ఇప్పుడెలా ఉందో.. ఏమి చేస్తోందో తెలుసుకుందామా..
Video Advertisement
1980 అక్టోబర్ 24 న జన్మించిన లైలా ముంబై లో నివసించేవారు. అప్పట్లో ఆమె మోడలింగ్ నే తన వృత్తి గా ఎంచుకున్నారు. “దుష్మన్ దునియాకా” అనే బాలీవుడ్ చిత్రం తో లైలా వెండితెరకు పరిచయం అయ్యారు. ఆ తరువాత ఆమె ను చూసిన ఎస్ వి కృష్ణా రెడ్డి తన తెలుగు సినిమా “ఎగిరే పావురమా” లో అవకాశం ఇచ్చారు. ఈ సినిమా తరువాత ఆమె చాలా సినిమాలే చేసారు. ఉగాది, శుభలేఖలు, పెళ్లి చేసుకుందాం వంటి సినిమాలు ఆమెకు బాగా పేరు తెచ్చిపెట్టాయి..
బాలకృష్ణతో కలిసి నటించిన “పవిత్ర ప్రేమ” సినిమా ఆమె ను బాగా పాపులర్ చేసింది. ఆ తరువాత ఆమె వ్యాపారవేత్త ఇరానీ మెహదీన్ ను ప్రేమించి 2006 లో అతనినే వివాహం చేసుకుంది. వీరికి ఇప్పుడు ఇద్దరు పిల్లలు కూడా.. పెళ్లి అయ్యాక ఇంటికే పరిమితమైన లైలా తిరిగి టాలీవుడ్ లోకి రీ ఎంట్రీ ఇవ్వబోతున్నారంటూ ఆ మధ్య గాసిప్ లు కూడా వచ్చాయి.. అయితే.. కుటుంబం తో హ్యాపీ గా ఉన్న లైలా తన భర్త వ్యాపారాల్లో కూడా పాలు పంచుకోబోతోందట.. సో ఇప్పట్లో.. లైలా రీ ఎంట్రీ ఉండకపోవచ్చనే తెలుస్తోంది.
End of Article